Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2008 ఉప ఎన్నికలతోనే రాజకీయాలు వద్దనుకున్నా కానీ.. ఆ వ్యాసం?: కేటీఆర్

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2008 ఉప ఎన్నికల్లో తమ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పూర్తిగా నిరాశలో కూరుకుపోయామని.. ఆ దశలో కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోవాలేమోనని అనిపిం

2008 ఉప ఎన్నికలతోనే రాజకీయాలు వద్దనుకున్నా కానీ.. ఆ వ్యాసం?: కేటీఆర్
, సోమవారం, 13 మార్చి 2017 (14:03 IST)
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2008 ఉప ఎన్నికల్లో తమ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పూర్తిగా నిరాశలో కూరుకుపోయామని.. ఆ దశలో కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోవాలేమోనని అనిపించిందని.. అప్పట్లో తాను రాజకీయాలను వదిలేద్దామని అనుకున్నానని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రేమ్‌రాజ్‌ దర్శకత్వం వహించిన 'శరణం గచ్ఛామి'కి రవికళ్యాణ్ సంగీతం అందించారు. నవీన్‌ సంజయ్‌, తనిష్క్‌ తివారీ జంటగా నటించారు. బొమ్మకు మురళి నిర్మాత. ప్రేమ్‌రాజ్‌ దర్శకత్వం వహించిన'శరణం గచ్ఛామి' చిత్ర గీతాల్ని ఆదివారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అప్పట్లో రాజకీయాలకు దూరమైపోదామనుకున్నాను. అయితే ఓ పత్రికలో చదివిన వ్యాసం నన్ను ఉత్తేజితుణ్ని చేసింది. ఆ వ్యాసం రాసింది ప్రేమ్‌రాజ్‌ అని తెలిసింది. ఆయన్ని కలుసుకొని మాట్లాడా' అని కేటీఆర్ చెప్పారు.
 
తమ సర్కారు ఏర్పడి ఇన్ని సంవత్సరాలైనా ప్రేమ్ రాజ్ ఏనాడూ సాయం అడగలేదని... ఆయన తీసింది మూడు సినిమాలే. అయినా రాశి కాదు వాసి ముఖ్యమని చాటారు. ఈ చిత్రానికి ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ వెల్లడించారు. ఈ రోజుల్లో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. దమ్ముంటే అదే పెద్ద సినిమా. ఆ సత్తా 'శరణం గచ్ఛామి'లో కనిపిస్తోందని కేటీఆర్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బండ్ల గణేష్ వ్యాపార విస్తరణకు బ్రేకులు వేసిన బీజేపీ... ఎలా.. ఎక్కడ?