బాహుబలి స్టార్ ప్రభాస్ పెళ్లి గురించే ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఒకవైపు అనుష్కతో పెళ్లి ఖాయమని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు బాలీవుడ్ నటి కృతి సనన్‌తో ప్రభాస్ పెళ్లి జరుగుతుందని వదంతులు వస్తున్నాయి. ఈ వార్తలపై కృతి సనన్ స్పందించింది.
ఒకవేళ ఛాన్స్ వస్తే ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని కృతి వెల్లడించింది. అలాగే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా ప్రభాస్ వివాహంపై స్పందించాడు. ప్రభాస్ జీవితంలో కొత్త డార్లింగ్ వుందని చెప్పారు. ప్రభాస్, కృతి జంట చూసేందుకు అందంగా వుంటుందని కితాబిచ్చారు.
కాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ కలిసి ఆదిపురుష్ చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగ్ లోనే ఇద్దరి మధ్య ప్రేమాయణం మొదలైందని చెప్తున్నారు. ఈ వార్తలకు చెక్ పెట్టేలా కృతి స్పందించింది. డార్లింగ్‌ను పెళ్లి చేసుకునే ఛాన్సు వస్తే మాత్రం వదులుకోనని తెలిపింది.