Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదర్శం ఆశీర్వదిస్తున్నట్టుంది: దర్శకుల ఉత్తరాల్లోనూ డైలాగులే..

రాజమౌళి ప్రశంసలకు గౌతమిపుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్ అంతే దీటుగా స్పందిస్తూ ఫేస్‌బుక్‌లో సాహో రాజమౌళి అంటూ ఓ లేఖ పోస్ట్ చేశారు. ఆదర్శ దర్శకుడు మీరు. అలాంటి మీరు నన్ను ప్రశంసిస్తుంటే సాక్షాత్తూ ఆ ఆదర్శమే నన్ను ఆశీర్వదిస్తున్నట్లుంది అంటూ క్రిష్ కృతజ్

Advertiesment
ఆదర్శం ఆశీర్వదిస్తున్నట్టుంది: దర్శకుల ఉత్తరాల్లోనూ డైలాగులే..
హైదరాబాద్ , మంగళవారం, 24 జనవరి 2017 (03:30 IST)
తెలుగు సినిమాలలో ఇప్పుడొక నయా ట్రెండ్. సినిమాలో కథ లేకపోయినా, ఇతర సాంకేతిక, కళాత్మక విలువలు నాసిరకంగా ఉన్న ఆ ఒక్కటుంటే చాలు విజయానికి గ్యారంటీ అనే నమ్మకం టాలీవుడ్‌లో ప్రబలిపోయింది. ఆ ఒక్కటీ ఏమిటంటే డైలాగులు. ఊపిరాడకుండా, ప్రేక్షకలను కన్నార్పకుండా, సీను తర్వాత సీనులో అలా పంచ్ డైలాగులను గుప్పిస్తే చాలు కాసులు రాలడం గ్యారంటీ అనుకుంటున్నారు సినీ జనం. హిట్లు, హీరోలు అభిమానులు సక్సెస్ మీట్‌లు వీటన్నింటిని పక్కనబెట్టి చూస్తే ఈ డైలాగుల పవర్ ఎంత బలంగా ఉందంటే దర్శకుల లేఖలు సైతం కవిత్వంతో ఉట్టిపడుతున్నాయి. ఇలా డైలాగులు జ్వరం పట్టిన వారిలో తాజాగా క్రిష్ కూడా చేరిపోయారు.
 
విషయానికి వస్తే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను 79 రోజుల వ్యవధిలో అత్యద్భుత రీతిలో తీసి చిరస్మరణీయ విజయం సాధించినందుకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి క్రిష్‌ను అభినందనలతో ముంచెత్తాడు. వెండితెరముందు ఒక అద్భుతాన్ని సృష్టించావంటూ రాజమౌళి శాతకర్ణి దర్శకుడిని ఆకాశానికెత్తేశారు. ఇంత భారీతనంతో ఇంత తక్కువకాలంలో ఎలా తీశావో చెప్పవా అంటూ రాజమౌళి క్రిష్‌ను అడిగారు. 
 
రాజమౌళి ప్రశంసలకు గౌతమిపుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్ అంతే దీటుగా స్పందిస్తూ ఫేస్‌బుక్‌లో సాహో రాజమౌళి అంటూ ఓ లేఖ పోస్ట్ చేశారు. ఆదర్శ దర్శకుడు మీరు. అలాంటి మీరు నన్ను ప్రశంసిస్తుంటే సాక్షాత్తూ ఆ ఆదర్శమే నన్ను ఆశీర్వదిస్తున్నట్లుంది అంటూ క్రిష్ కృతజ్ఞతలు చెప్పారు. భుజం తడుతున్న మీ చేతిని ఎన్నిసార్లు నా నుదుటికి తాకించుకున్నా అది తక్కువే అంటూ క్రిష్ ఉద్వేగానికి గురయ్యారు. కేవలం మూడు నాలుగు వాక్యాలతో కూడిన ఆ క్లుప్త ఉత్తరం ఇప్పుడు ఓ సంచలనం. 
 
చదువుతున్నా, పలుకుతున్నా మాట మంత్రమై, మహత్తై మనోహరమై పులకింపి చేస్తున్నట్లు సాగిన క్రిష్ లేఖను చూద్దాం.
 
ప్రియమైన రాజమౌళి గారూ,
నాకు ఆదర్శంగా నిలిచిన దర్శకుల్లో మీరు ఒకరు.. అందరూ విజయం కోసం ఎదురుచూస్తుంటారు, కానీ విజయం మీ సినిమా కోసం ఎదురుచూస్తుంటుంది.. అలాంటి మీరు విజయం వరించింది క్రిష్ అంటే నాకెలా వుంటుంది? ఎన్ని ధన్యవాదాలు చెపితే సరిపోతుంది? దర్శకత్వంలోనే కాదు, వ్యక్తిత్వంలో కూడా నాకు ఆదర్శంగా నిలిచారు.. మీ అభినందన వింటుంటే, ఆదర్శం ఆశీర్వదిస్తున్నట్టుంది.. భుజం తడుతున్న మీ చేతిని ఎన్నిసార్లు నా నుదురు తాకినా తక్కువే.. త్రికరణశుద్ధిగా చెపుతున్నాను..
సాహో రాజమౌళి.. సాహో..
ప్రేమతో,
క్రిష్.
 
క్రిష్ త్రికరణ శుద్ధిగానే రాజమౌళికి ఇలాంటి ఉత్తరం రాసి ఉండవచ్చు. కాని ఇక్కడ విషయం అంతర్లీనంగా వ్యక్తమవుతోంది. తెలుగు సినిమాల్లోనే కాదు, బయట కూడా వట్టిమాటలు సాయిమాధవ్ డైలాగుల రూపం దాల్చి ప్రతి ఒక్కరినీ ఆవహిస్తున్నట్లుంది. నిజమే కదూ..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇల్లు మారినా ఫేట్‌ మారలేదు... బ్రహ్మి తిప్పలు....