Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జనతా గ్యారేజ్‌పై కోట శ్రీనివాస్ సెన్సేషనల్ కామెంట్స్.. తెలుగోడికి ప్రాముఖ్యత లేదు..

ఎన్టీఆర్‌ నటించిన ''జ‌న‌తా గ్యారేజ్'' సినిమా వ‌సూళ్లతో బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర కొనసాగిస్తోంది. సెప్టెంబర్‌ 1న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులు త‌న ఖాతాలో వేసుకుంది. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌

జనతా గ్యారేజ్‌పై కోట శ్రీనివాస్ సెన్సేషనల్ కామెంట్స్.. తెలుగోడికి ప్రాముఖ్యత లేదు..
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (14:29 IST)
ఎన్టీఆర్‌ నటించిన ''జ‌న‌తా గ్యారేజ్'' సినిమా వ‌సూళ్లతో బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర కొనసాగిస్తోంది. సెప్టెంబర్‌ 1న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులు త‌న ఖాతాలో వేసుకుంది. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో యలమంచిలి రవిశంకర్‌, ఎర్నేని నవీన్‌, సి.వి.మోహన్‌లు నిర్మించిన చిత్రం 'జనతాగ్యారేజ్‌'. అయితే ఈ చిత్రం సక్సెస్ గురించి కోట శ్రీనివాస్ సంచలన వాఖ్యలు చేశారు. 
 
ఈ చిత్రంలో తెలుగు నటీనటులుకు అవకాశాలు ఇవ్వలేందంటూ కోట ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. తెలుగోడి నటనకు ప్రాముఖ్యత లేకుండా పోతుంది..ఈ మధ్య కాలంలో చాల సినిమాల్లో పరి భాష నటులను ఎంచుకుంటూ, తెలుగు నటులకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు..వారికీ మాత్రమే నటన వచ్చా..? మాకు రాదా అంటూ ఘాటుగా స్పందించాడు. ''జనతా గ్యారేజ్''లో నటించిన మలయాళ నటుడు మోహన్ లాల్‌ను గురించి ప్రస్తావిస్తూ సినిమాలో మోహన్ లాల్ బాగా చేసాడు అంటున్నారు. అతను గ్రేట్ మలయాళం యాక్టర్ అతడు బాగా చెయ్యడంలో అతిశయోక్తి లేదు. 
 
అతని స్థానంలో మన తెలుగు నటుడిని పెట్టుకోవచ్చు కదా…అతనంత ధీటుగా నటించే తెలుగువాడు లేడా? అంటూ ప్రశ్నించాడు. అతన్ని పెట్టుకుని సినిమా చేసి.. బాగా చేశాడు అంటే ఎలా? మరి తెలుగువాడు ఏమైపోయాడు? అది చూపించాక తెలుగువాడు ఎంత యాక్ట్ చేస్తే నీకు ఆనతాడు?" అంటూ ప్రశ్నించారు కోట. "పనైపోతుంది కదా వాళ్ళని పెట్టుకుంటే.. తెలుగోడు భోజనం చేయనక్కర్లేదా??" అంటూ తనదైన శైలిలో ఘాటైన కామెంట్స్ చేశారు కోట. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకువచ్చిన జనతాగ్యారేజ్ వసూళ్లపరంగా రికార్డులను క్రియేట్‌చేస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొద్దస్తమానం సెల్ ఫోన్‌తో గడపడం కాదు పక్కన పెళ్ళాం వుంది.. గీతా మాధూరి - నందు ఆసక్తికర సంభాషణ