Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోనసీమ థగ్స్ ను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తుంది

Advertiesment
Konaseema Thugs
, శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (14:44 IST)
Konaseema Thugs
ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకత్వంలో హ్రిదు హరూన్ ను హీరోగా పరిచయం చేస్తూ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం 'కోనసీమ థగ్స్'. సింహ, ఆర్ కె సురేష్, మునిష్ కాంత్, అనస్వర రంజన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ షిబు తమీన్స్ తనయురాలు రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై జియో స్టూడియోస్ భాగస్వామ్యంతో భారీ స్థాయిలో నిర్మించారు. 
 
టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఇటీవలే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పి పేరిట పంపిణీ రంగంలోకి కూడా ప్రవేశించారు. సంక్రాంతి కి విడుదలై ఘనవిజయం సాధించిన భారీ చిత్రాలు వాల్తేర్ వీరయ్య, వీర సింహా రెడ్డి లను నిర్మించడమే కాకుండా ఒకే సమయంలో నైజాం ఏరియాలో రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు మైత్రి సంస్థ వారు. ఆద్యంతం ఉత్కంఠ రేపేలా రూపొందిన కోనసీమ థగ్స్ సంబంధించి ట్రైలర్, పోస్టర్స్, అమ్మన్ సాంగ్ చూసి ఇంప్రెస్ అయ్యి తెలుగు వెర్షన్ ను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పి ద్వారా అన్ని ఏరియాల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. 
 
ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన కోనసీమ థగ్స్ ఇటీవల విడుదలైన అమ్మన్ పాటతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో సినిమా పట్ల మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మైత్రి సంస్థ జత కలవడంతో, చిత్రం భారీ స్థాయిలో ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ కానుంది. చిత్ర బృందం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఈ నెల 19న నిర్వహించనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెల్లంకొండ గణేష్ నటించిన నేను స్టూడెంట్ సార్ డేట్ ఫిక్స్