Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆకాశం నుంచి అథ:పాతాళానికి చేరిన కొమరం వెంకటేష్‌ - స్పెషల్ స్టోరీ

Komaram Venkatesh
, శనివారం, 8 ఏప్రియల్ 2023 (17:39 IST)
Komaram Venkatesh
కర్ణుడి చావుకు సవాలక్షకారణాలు. సామాన్యుడి నుంచి అసమాన్యుడిగా ఎదిగిన వ్యక్తులు ఇలా ఎన్నో రకాలుగా కథలు, వార్తలు తెలిసిందే. తెలుగు సినిమారంగంలో జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఒక్కరోజుకే సినిమా హిట్‌ అయితే స్టార్‌ అయిపోతాడు. ఆ తర్వాత ఆయన కెరీర్‌ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అప్పుడే సరైన అడుగులు వేయాలి. లేదంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా దిగజారిన సంఘటనలు తెలిసిందే. తమిళనాడులో వడివేలు జీవితమే ఉదాహరణ.

webdunia
Komaram Venkatesh,datatreya
ఇప్పుడు తెలుగు సినిమారంగంలో జూనియర్‌ ఆర్టిస్టుగా వుంటూ నిర్మాతగా, చిత్రపురి కాలనీ అధ్యక్షుడిగా వెలుగువెలిగిన కొమరం వెంకటేష్‌ మరణం కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. శనివారంనాడు ఆయన భౌతిక కాయాన్ని చిత్రపురికాలనీలో కార్మికుల సందర్శనార్థంవుంచారు. 9.30గంటలకు ప్రకాశంజిల్లా మాచర్లలో ఆయన స్వస్థలంకు తీసుకు వెళ్ళారు. ఎంతోమంది ప్రముఖులు ఆయన్ను చివరిసారిగా చూడడానికి విచ్చేశారు. 49 ఏళ్ళ వెంకటేష్ కు గుండెపోటు రావడంతో ఆపరేషన్ చేశారు. రెండేరోజు శుక్రవారం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో తనువూ చాలించారు. 
 
 
webdunia
Komaram Venkatesh, karmikulu
వెంకటేష్‌ గురించి కార్మికులకు చెబుతున్న విషయాలు వింటే ఆశ్చర్యపోకమానదు. తమతోపాటు జూనియర్‌ ఆర్టిస్టుగా చేసిన రోజుల్ని కొందరు తలచుకుంటే క్రమేణా జూనియర్‌ ఆర్టిస్ట్‌గా ఎదిగిన విధానాన్ని మరొకరు గుర్తు చేసుకున్నారు. అలా ఒక్కోమెట్టు ఎక్కుతూ ఫైనల్‌గా 24క్రాఫ్ట్‌కు చెందిన ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా ఎదిగారు. ఆ తర్వాత సినీ కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో చిత్రపురికాలనీ ఏర్పాటు ఎంతో దోహదపడ్డారు. ఆయన దానికి అధ్యక్షుడిగా వున్నారు. అలా కొంతమంది కమిటీగా ఏర్పడిన తర్వాత అక్కడ కాలనీ కట్టడాలలో, ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటలనలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. 11 మంది సభ్యులున్న చిత్రపురి సొసైటీ కమీటీ తారాజువ్వలా కొంతకాలం వెలిగింది. 
 
సరిగ్గా ఆ టైంలో 2015లో ఆయన నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా షేర్‌ అనే సినిమాను నిర్మించారు. ఆ సినిమా తీసేటప్పుడు ప్రీప్రొడక్షన్‌ పనులకోసం ఆయన చుట్టు ఆయన నమ్మిన వ్యక్తులు లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేశారు. సినిమా విడుదలకు అప్పట్లో శాటిలైట్‌ ఆఫర్‌ మంచి ధరకు వస్తే 5కోట్లకు పైగా వస్తుందని కొందరు చెప్పిన సూచనను ఆయన నమ్మారు. కానీ ఆ సినిమా ఢమాల్‌ అనడంతో ఒక్కసారిగా ఆయనకు సూచన చేసినవారంతా కొంతకాలం కనుమరుగయ్యారు. 
 
పెద్దగా చదువుకోలేని వ్యక్తి వెంకటేష్‌ అయినా ఉన్నతస్థాయికి చేరాక ముందుతరం అనుభవాలను బేరీజువేసుకుంటే బాగుండేది. కానీ అలా చేయకుండా తన చుట్టూ వున్న ఓ కోటరి చెప్పినట్లు వినడంతో కొంత స్వయం కృతాపరాథంలో కాలనీ వ్యవహారాల్లో అవినీతిలో ఇరుక్కుపోయారు. అది 2023కు పీక్‌ స్టేజీకి చేరింది. ఆ తర్వాత 2019కుముందే అధ్యక్షుడిగా తొలగింపపడ్డాడు. అప్పటినుంచీ ఆయన కెరీర్‌ పడిపోయింది. ప్రస్తుతం ఆయన సిబిసిఐడి దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన ఉన్న ఆస్తులన్నీంటినీ అమ్ముకోవాల్సి వచ్చిందని సహచరులు తెలియజేశారు.
 
మరోవైపు పీక్‌ స్టేజీలో వుండగానే సోదరుడయిన బంధువుతో కర్నాటకలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశాడు. అది కరోనా టైంలో దెబ్బేసింది. ఆ తర్వాత పార్టనర్‌ షిప్‌తో వుండడంతో చుట్టమే హ్యాండ్‌ ఇచ్చాడనే టాక్‌ కూడా వుంది. ఇలా ఆదాయ మార్గాలు మూసుకుపోవడంతో ఒక్కో ఆస్తిని అమ్ముకూంటుపోయారని, మరోవైపు గత చిత్రపురి కమిటీలో ఆయన ఆధ్వర్యంలో జరిగిన వందల కోట్ల రూపాయల అవినీతికి అతన్నే మిగిలినసభ్యులు టార్గెట్‌ చేయడంతో తట్టుకోలేకపోయారని పలుసార్లు సన్నిహితులవద్ద చెప్పారని తెలిసింది.
 
దీనికితోడు చిత్రపురికాలనీ ప్రతిఏడాది అమ్మవారి బోనాలు జరుపుతారు. ఆ చుట్టుపక్కల గుడికూడాలేదు. ఓసారి బోనాలలో అమ్మవారు పూని నాకు గుడి కట్టండి అంటూ భవిష్యవాణి చెప్పిందనీ, దాన్ని ఆయన చాలా తేలిగ్గా తీసుకున్నారనీ, అందుకు సన్నిహితుల సూచనలుగా కూడా తోడుకావడంతో అప్పటినుంచీ వెంకటేష్‌ డౌన్‌ఫాల్‌ అయ్యాడని మరో వార్త ప్రచారంలో వుంది. అనంతరం చిత్రపురికమిటీలో సభ్యుడు అయిన అనిల్‌ వల్లభనేని  అమ్మవారి గుడి బాధ్యతను తీసుకోవడం, ఆ తర్వాత అనిల్‌ చిత్రపురి కమీటీ అధ్యక్షుడుగా ఎదగడం, తెలుగుదేశం పార్టీనుంచి పోటీచేయడం, ఆ తర్వాత బిజెపిలోకి వెళ్ళడం జరిగిన విషయాలు. ఇవన్నీ గుర్తుచేసుకుంటూ ఆయన సన్నిహితులు ఎంతో స్థాయికి వెళ్ళి ఒక్కసారిగా అథ:పాతాళానికి వెళ్లాడని అనుకోవడం వెంకటేష్‌ అంతిమ యాత్రలో జరిగింది. అందుకే పెద్దలంటారు మనంచేసిన పుణ్యం, పాపం ఇక్కడే అనుభవిస్తామని.. ఇది ఇప్పటితరం తెలుసుకోవాలని పెద్దలు ఏనాడో చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గూగుల్‌ను రిపేర్‌ చేయాలన్నా గురువే కావాలి : వెంకయ్య నాయుడు