Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్షయ్ ''గే'' అనుకుని ఏడాది సహవాసం చేశాకే.. పెళ్లి చేసుకున్నా... ట్వింకిల్ ఖన్నా

ఉత్తరాదిన ట్రెండింగ్‌లో ఉన్న టెలివిజన్ షో 'కాఫీ విత్‌ కరణ్‌' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమానికి పెద్ద పెద్ద స్టార్లు వారి ఫ్యామిలీతో హాజరవుతారు. ఇదే తరహాలో బాలీవుడ్‌ సూపర్ పె

Advertiesment
Koffee with Karan Season 5 Episode two
, సోమవారం, 14 నవంబరు 2016 (16:23 IST)
ఉత్తరాదిన ట్రెండింగ్‌లో ఉన్న టెలివిజన్ షో 'కాఫీ విత్‌ కరణ్‌' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమానికి పెద్ద పెద్ద స్టార్లు వారి ఫ్యామిలీతో హాజరవుతారు. ఇదే తరహాలో బాలీవుడ్‌ సూపర్ పెయిర్ జంటగా పేరు కొట్టేసిన జోడీల్లో ఒకటైన యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్‌, ట్వింకిల్‌ ఖన్నా జోడీ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కరణ్ వేసిన పలు ప్రశ్నలకు అక్షయ్ జోడీ బదులిచ్చింది. 
 
ఇంకా షాకింగ్ విషయాలను కూడా ట్వింకిల్ బయటపెట్టేసింది. ముఖ్యంగా అక్షయ్ కుమార్‌తో తన పెళ్ళి జరిగేందుకు గల కారణాలను అభిమానులతో పంచుకున్నారు. అమీర్‌ఖాన్‌, ట్వింకిల్‌ జంటగా నటించిన 'మేళా' చిత్రం షూటింగ్‌ సమయంలో అక్షయ్‌ వచ్చి ట్వింకిల్‌ను వివాహం చేసుకుంటానని అడిగారట. కానీ అప్పటికీ తనకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పారట. 
 
అంతేగాకుండా..'మేళా' హిట్‌ అవుతుందని ఆ తర్వాత కథానాయికగా తన కెరీర్‌ ఊపందకుంటుందని ట్వింకిల్‌ భావించారట. అయితే 'మేళా' ఫ్లాప్‌ కావడంతో అక్షయ్‌ అదృష్టవంతుడయ్యారని ట్వింకిల్ చెప్పారు. వెంటనే తమ వివాహం జరగలేదని, తన తల్లి డింపుల్‌ను అక్షయ్ ఒప్పించాల్సిన అవసరం ఏర్పడిందని.. ఆ సందర్భంలో అక్షయ్‌ 'గే' అని డింపుల్‌ భావించారని ఒక ఏడాది అక్షయ్‌తో సహవాసం చేసిన తర్వాత పెళ్లి చేసుకోమని తన తల్లి సలహా ఇచ్చినట్లు ట్వింకిల్‌ వెల్లడించారు.
 
అక్షయ్‌, ట్వింకిల్‌ ఖన్నాకు 2001లో వివాహం అయింది. వీరికి ఒక బాబు, పాప. అక్షయ్‌ శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న '2.0'లో ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్కసారి నో చెప్పండి.. బంగారు జీవితాన్ని పొందండి.. విక్టరీ వెంకటేష్ సందేశం (వీడియో)