ప్రశాంతి నిలయంలో 'శ్రీ సత్యసాయి బాబా' షూటింగ్
సౌభాగ్య చిత్ర, ఎస్.సి.టి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ``శ్రీ సత్యసాయి బాబా``. `అమ్మోరు`, `అరుంధతి`, `దేవుళ్లు` వంటి విజువల్ వండర్స్‌ని అందించిన దర్శకుడు కోడి రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వ
సౌభాగ్య చిత్ర, ఎస్.సి.టి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ``శ్రీ సత్యసాయి బాబా``. `అమ్మోరు`, `అరుంధతి`, `దేవుళ్లు` వంటి విజువల్ వండర్స్‌ని అందించిన దర్శకుడు కోడి రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కరాటం రాంబాబు నిర్మాత. పుట్టపర్తి సత్యసాయి బాబాపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా స్వరాల్ని సమకూర్చుతున్నారు. జొన్నవిత్తుల సింగిల్ కార్డులో 14 పాటలకు సాహిత్యం అందిచడం ఈ చిత్ర విశేషం.
ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా ఇప్పటికే ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఏదైతే పుట్టపర్తిలో జరిగిన సంఘటనల్ని యధాతథంగా ఈ సినిమాని తీస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో వేసిన ``ప్రశాంతి నిలయం``భారీ సెట్‌లో నెల రోజుల షూటింగ్ జరుగుతోంది. మార్చి 10 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఈ సినిమా ``సత్యసాయి బాబా`` జీవిత చరిత్రని చూపించే అపురూపమైన చిత్రం ఇది. ప్రపంచంలోనే ఎక్కడలేని విధంగా సత్యసాయి చేపట్టిన క్యాష్‌లెస్ ప్రీ హార్ట్ సర్జరీ, అన్ని ఫ్రీగా ఇచ్చేట్టు పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా ఇది అమలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి తెలియ చెప్పేదే ఈ చిత్ర కథ.
సత్యసాయిగా మలయాళ నటుడు శ్రీజిత్ విజయ్ నటిస్తున్నారు. సత్యసాయికి మాతృమూర్తిగా జయప్రద, తండ్రి పాత్రలో శరత్ బాబు నటిస్తున్నారు. ఉలగనాయగన్ కమల్ హాసన్‌కి మేకప్‌మేన్‌గా పనిచేసిన రమేష్ మెహంతి ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయింది. మంగళంపల్లి బాలమురళి కృష్ణ తన చివరి సినిమా సాంగ్ కూడా ఈ సినిమానే కావడం విశేషం. ఈ సినిమా పాటల్లో ఆయన పాట హైలెట్‌గా నిలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి ఎస్.పి.బాలసుబ్రమణ్యం, వందేమాతరం శ్రీనివాస్, చిత్ర, హరిచరణ్, విజయ్ ప్రకాష్, కవితా కృష్ణమూర్తి , కైలాస్ కేర్, సుఖ్విందర్ సింగ్, మల్లాడి బ్రదర్స్, ఆండ్రియా, టిప్పు, తదితరులు గానాలపన చేశారు. ప్రఖ్యాత ఛాయగ్రాహకుడు వాసు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.