Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోడి రామ‌కృష్ణ కుమార్తె సినిమా నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని

కోడి రామ‌కృష్ణ కుమార్తె సినిమా  నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని
, బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (11:31 IST)
Kiran Abbavaram
శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు, అజాత‌శత్రువు అయిన కీర్తిశేషులు శ్రీ కోడి రామ‌కృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా  కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో సినిమా నిర్మిస్తోంది. కార్తిక్ శంక‌ర్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ చిత్రంలో రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సూప‌ర్‌హిట్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల ‌హృద‌యాల్లో కుటుంబ‌స‌భ్యుడిగా పేరు సంపాదించుకున్న‌ కిరణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది. 
 
ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ ఆడియోని ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు. తెలుగు సినిమా ద‌ర్శ‌క లెజెండ్ కోడి రామ‌కృష్ణ గారు సమ‌ర్ప‌ణ‌లో వ‌స్తున్న ఈ చిత్రానికి 'నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని' అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. కోడి రామ‌కృష్ణ గారు చిత్రాలన్ని ఫ్యామిలీ అంతా థియాటర్ కి పిక్నిక్ గా వెళ్ళి చూసేవారు. ఇప్ప‌టికీ టీవి లో ఆయ‌న చిత్రాలు వ‌స్తున్నాయంటే ఫ్యామిలీ అంతా కూర్చిని చూస్తుంటారు. అలా తెలుగు ప్రేక్ష‌కుల‌కి ఆయ‌న బాగా కావాల్సిన‌వాడిగా వారి కుటుంబ‌సభ్యుడిగా మారిపోయారు. 
 
అలాంటి తెలుగు ద‌ర్శ‌కుడి పెద్ద కుమార్తె దివ్య దీప్తి, అలాగే మంచి చిత్రాలు చేస్తూ ప్ర‌తి ప్రేక్ష‌కుడికి బాగా కావాల్సిన వాడిలా కిర‌ణ్ అబ్బ‌వ‌రం క‌లిసిపోవ‌డం, ఈ చిత్ర కథ కూడా అన్ని ఎమోష‌న్స్ తో రావ‌డం తో ఈ చిత్రానికి నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని  అనే టైటిల్ ని ఖ‌రారు చేసారు. కోడి రామ‌కృష్ణ గారి దివ్య ఆశిస్సుల‌‌తో టైటిల్ ని ఈరోజు ఎనౌన్స్ చేయ‌డం జ‌రిగింది. ఈ చిత్రానికి సంభందించిన మొద‌టి లుక్ ని కూడా విడుదల చేశారు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం ల‌వ‌ర్ బాయ్ లుక్ చూసిన ప్రేక్ష‌కులు ఒకే సారిగా మాస్ క‌మ‌ర్షియ‌ల్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకున్నాడు. టాలీవుడ్ లో వున్న క‌మ‌ర్షియ‌ల్ హీరోల స‌ర‌స‌న చేరేలా ఈ లుక్ వుండ‌టం విశేషం.
ఈ సినిమాకి సంబందించిన ఎక్సైట్‌మెంట్ న్యూస్ మ‌రి కొన్ని రొజుల్లో తెలియ‌జేస్తారు.
 
న‌టీన‌టులు - కిర‌ణ్ అబ్బ‌వ‌రం, సంజ‌న ఆనంద్‌, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్క‌ర్‌, స‌మీర్‌, సంగీత‌, నిహ‌రిక‌, ప్ర‌మోదిని త‌దిత‌రులు
 
స‌మ‌ర్ప‌ణ‌.. కోడి రామ‌కృష్ణ‌,  లిరిక్స్‌.. భాస్క‌ర్ భ‌ట్ల,  ఎడిట‌ర్‌.. ప్ర‌వీన్ పూడి, ఆర్ట్ డైర‌క్ట‌ర్‌.. ఉపేంద్ర రెడ్డి,  ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్ ..  భ‌ర‌త్ రొంగలి,  సినిమాటోగ్ర‌ఫి.. రాజ్ నల్లి,  సంగీతం.. మ‌ణిశ‌ర్మ‌, కో-ప్రోడ్యూస‌ర్‌.. న‌రేష్ రెడ్ది మూలె, ప్రోడ్యూస‌ర్‌.. కోడి దివ్య దీప్తి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్రపరిశ్రమలో వరుస విషాదాలు.. సీనియర్ నటి, రేడియో జాకీ మృతి