కిమ్ శర్మ.. బాలీవుడ్ హీరోయిన్. టాలీవుడ్‌లో కూడా ఖడ్గం మూవీతో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈమె ఓ బాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం.
నిజానికి భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో ఈమె డేటింగ్ చేసినందనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ ఇద్దరికి బ్రేకప్ కావడంతో 2010లో అలి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆరేళ్ల కాపురం తర్వాత అలికి విడాకులిచ్చేసింది.
ఇప్పడు వర్ధమాన బాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రాణేతో డేటింగ్ చేస్తున్నది.. హర్షవర్ధన్ రాణేతో ఎంజాయ్ చేస్తోంది. కుర్ర హీరోయిన్‌లాగా అతడితో బైక్ రైడింగ్ జాయింట్‌గా చేస్తూ పరవశించిపోతోంది. తాజాగా హర్షవర్దన్ రాణేతో కలిసి బైక్ రైడింగ్ కెళ్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.