Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందాన్ని ఇలా కాపాడుకుంటోన్న కియారా!

Advertiesment
అందాన్ని ఇలా కాపాడుకుంటోన్న కియారా!
, సోమవారం, 7 జూన్ 2021 (09:49 IST)
Kiara Advani
`భ‌ర‌త్ అనే నేను, విన‌య విధేయ రామా` ఫేమ్ అందాల తార కియారా అద్వానీ త‌న అందాన్ని ఎలా కాప‌డుకుంటుందో తెలియ‌జేస్తుంది. అంత‌ర్జాతీయ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం రోజున అంద‌రూ మొక్క‌లు నాటుతూ ఇత‌రుల‌కు ఛాలెంజ్‌లు విసురుతుంటే అందాల తార కియారా అద్వానీ మ‌రో ర‌కంగా స్పందించింది. స‌ముద్రంలో స్విమ్ చేస్తూ గ‌తంలో ఎంజాయ్ చేసిన ఫొటో త‌న సోష‌ల్‌మీడియాలో పెట్టింది. అల‌ల‌ను మ‌నం ఆప‌లేం, అయితే ఈత నేర్చుకోవ‌చ్చు అంటూ కాప్ష‌న్ పెట్టింది. బికినీ వేసుకుని సాగ‌రంలో స్విమ్ చేస్తుంటే ప్ర‌పంచంమే మ‌న‌కు ద‌గ్గ‌ర‌గా వున్న‌ట్లుంద‌ని పేర్కొంది.
 
ఈ అందాల భామి ఫొటోను చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. మీ వీడియోను చూస్తుంటే ఈత‌నేర్చుకోవాల‌నంద‌ని కొంద‌రంటే ఈ ఫొటోను మెచ్చుకుంటూ వైర‌ల్ చేసేశారు. ప‌ర్యావ‌ర‌ణం రోజూ ఆదివారంనాడు ఆమె పెట్టిన వీడియోను బాగా ఎంజాయ్ చేసి తొమ్మిది ల‌క్ష‌ల‌మంది చూసి ఎంజాయ్ చేశారు. మ‌రి కియారా అందానికి ఫిదా కావ‌డ‌మం ఇదే. ఎప్ప‌డో పెట్టిన దానికి ఇంత ఫాలోయింగ్ అయితే లేటెస్ట్‌గా స్విమ్మింగ్ ఫూల్‌లో వున్న‌ది పెడితే బాగుండేద‌ని కొంద‌రు ట్వీట్ చేశారు. ఇదిలా వుండ‌గా సినిమాప‌రంగా చెప్పాలంటే బాలీవుడ్‌లోనే `షేర్షా, భోల్ బుల‌య్యా -2`తో పాటు మ‌రో రెండు సినిమాల‌లో న‌టిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుక్క టైటిల్ పాత్ర‌లో ‘777 చార్లి’ టీజర్ విడుద‌ల చేసిన నాని