Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దావూద్‌ నన్ను కలిశాడు.. సినిమాలు, మద్యం, హీరోయిన్లే నా తండ్రి ప్రపంచం: రిషీ కపూర్

సెలెబ్రిటీల యధార్థాలను సూటిగా తన బయోగ్రఫీలో చెప్పుకొచ్చారు. బాలీవుడ్ ప్రముఖ నటులు రిషీ కపూర్. "ఖుల్లం ఖుల్లా: రిషీకపూర్ అన్ సెన్సార్డ్" పేరుతో తన స్వీయచరిత్ర రాసిన రిషీ కపూర్ ప్రస్తుతం అందరి నోళ్ళల్లో

Advertiesment
దావూద్‌ నన్ను కలిశాడు.. సినిమాలు, మద్యం, హీరోయిన్లే నా తండ్రి ప్రపంచం: రిషీ కపూర్
, మంగళవారం, 17 జనవరి 2017 (16:40 IST)
సెలెబ్రిటీల యధార్థాలను సూటిగా తన బయోగ్రఫీలో చెప్పుకొచ్చారు. బాలీవుడ్ ప్రముఖ నటులు రిషీ కపూర్. "ఖుల్లం ఖుల్లా: రిషీకపూర్ అన్ సెన్సార్డ్" పేరుతో తన స్వీయచరిత్ర రాసిన రిషీ కపూర్ ప్రస్తుతం అందరి నోళ్ళల్లో నానుతున్నారు. విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు.

ఈ బయోగ్రఫీలో సెలెబ్రిటీల ప్రవర్తనలతో పాటు వారి రాసలీలల గురించి చెప్పడమే కాకుండా మోస్ట్ వాంటెడ్ "అండర్ వరల్డ్ డాన్ దావూద్" ను తాను రెండుసార్లు కలిశానన్న విషయాన్ని బహిరంగంగానే సూటిగా చెప్పేశారు. అయితే ఆ చరిత్రంతా ముంబై పేలుళ్లకు ముందే జరిగిందన్న విషయాన్ని కూడా వెల్లడించారు. ప్రస్తుతం రిషీ కపూర్ స్వీయ చరిత్రలో పేర్కొన్న అంశాలే బాలీవుడ్ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
 
తాను దావూద్‌ను కలవలేదని.. అతడే తనను కలిశాడని చెప్పుకొచ్చిన రిషీ కపూర్.. "తవాయిఫ్ చిత్రంలో తన పాత్ర పేరు దావూద్" కావటంతోనే - 'డీ' కి తనంటే ఇష్టమని చెప్పారు. దావూద్‌తో తనకున్న సంబంధాలను గురించి చెప్పిన రిషీ కపూర్.. తన తండ్రి అయిన ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత రాజ్ కపూర్ గురించి కూడా సంచలన నిజాలు బయటకి చెప్పేశారు.  
 
సినిమాలు, మద్యం, కథానాయికలే తన తండ్రి ప్రపంచమని బహిర్గతం చేసేశాడు. తండ్రి అనే విషయాన్ని కూడా మరిచిపోయి.. ఆయన ప్రపంచం ఆ మూడేనని స్పష్టం చేశాడు. అంతటితో ఆగకుండా అలనాటి ప్రముఖ నటీమణులను కూడా రచ్చకు లాగారు.

నర్గీస్, వైజయంతీమాల, మధుబాల, జీనత్ ఆమన్, డింపుల్ కపాడియా, సిమి గ్రేవల్, మందాకిని, పద్మిని తదితర హీరోయిన్లతో తన తండ్రి కున్న సంబంధాల గురించి రాయటంతో ఆయన పుస్తకంపై భారీ చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి తండ్రికున్న "రిలేషన్-షిప్స్" చాటు మాటు విషయాలను రచ్చ రచ్చ చేసిన కొడుకుగా రిషీకపూర్ నిలిచిపోయాడు. ప్రస్తుతం రిషీ కపూర్ స్వీయచరిత్రకు సంబంధించిన రాతలపైనే చర్చ జోరుగా సాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయాల్లో హీటెక్కించిన రాధిక కామెంట్స్.. స్థానికేతరులను తమిళులు ఆదరించాలా? జయలలిత, రజనీ?