Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తుపాకీతో నన్ను షూట్ చేస్తారని జడుసుకున్నాను.. బతకనివ్వండని ప్రాధేయపడ్డా!

హాలీవుడ్ రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్‌(35)పై దుండగులు దాడి చేసి నుదిటికి తుపాకి గురిపెట్టి మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాలను దోచుకున్న సంగతి తెలిసిందే. ఓ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు ప్యారిస్ వచ్చ

Advertiesment
తుపాకీతో నన్ను షూట్ చేస్తారని జడుసుకున్నాను.. బతకనివ్వండని ప్రాధేయపడ్డా!
, మంగళవారం, 14 మార్చి 2017 (10:36 IST)
హాలీవుడ్ రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్‌(35)పై దుండగులు దాడి చేసి నుదిటికి తుపాకి గురిపెట్టి మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాలను దోచుకున్న సంగతి తెలిసిందే. ఓ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు ప్యారిస్ వచ్చిన ఓ లగ్జరీ హోటల్‌లో బస చేసిన కిమ్స, ఒంటరిగా ఉందనే విషయం తెలుసుకుని.. హోటల్‌లోకి చొరబడ్డారు.

పోలీస్ దుస్తుల్లో వచ్చిన దుండగులు కర్దాషియన్‌ను కట్టిపడేసి నుదిటికి తుపాకులు గురిపెట్టి దోచుకున్నారు. ఆమె వద్ద నున్న 5 మిలియన్ పౌండ్ల విలువచేసే ఆభరణాల బాక్స్, 3.5 మిలియన్ పౌండ్ల విలువైన రింగ్‌, రెండు స్మార్ట్‌ఫోన్లను దోచుకుని వెళ్లిపోయారు. అమెరికాలో సంచలనం రేపిన ఈ ఘటనలో పోలీసులు కిమ్ మాజీ డ్రైవర్ తో సహా 17 మందిని అరెస్టు చేశారు.
 
ఈ ఘటనపై తాజాగా కిమ్ కర్దాషియాన్ కన్నీటి పర్యంతమైంది. గత అక్టోబరు 3న ప్యారిస్ హోటల్లో ముఖాలకు మాస్కులు ధరించి వచ్చిన దుండగులు గన్‌తో తనను భయపెట్టిన తీరును గుర్తు చేసుకుని బావురుమంది. వాళ్ళు సుమారు 10 మిలియన్ డాలర్ల (దాదాపు 6 కోట్ల) విలువైన తన నగలను దోచుకుపోయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
 
వాళ్లు తన నుదుటిపై తుపాకీ పెట్టారు. తనను డబ్బులు అడిగారు. డబ్బులు లేవని చెప్పగా తనను ఈడ్చుకుని మెట్ల వద్దకు లాక్కుపోయారని కిమ్ పేర్కొంది. తుపాకీతో తనను షూట్ చేస్తారని జడుసుకున్నానని.. తనకు కుటుంబం ఉందని.. తనను బతకనివ్వండి అంటూ ప్రాధేయపడ్డానని చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూరీ జగన్నాథ్ రోగ్ ఆడియో లాంచ్.. ఇరగదీసిన సన్నీ లియోన్ (Video)