Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కత్రినా షేర్ చేసిన ఫొటోకు లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లూ.. ఇంతకూ ఆ ఫొటో ఏమిటబ్బా!

బాలీవుడ్‌ అందాల హీరోయిన్ కత్రినా కైఫ్‌ ఇన్‌స్టాగ్రామ్‌‌లో చేసే పోస్ట్‌లంటే అభిమానులకు ఎంతో ఆసక్తి. చిత్రీకరణ సమయాల్లో దిగిన ఫొటోలు, చిన్ననాటి ఫొటోలు పోస్ట్‌ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తుంటారు అయితే తాజాగా కత్రినా పోస్ట్‌ చేసిన ఓ ఫొటో మాత్రం వైరల్‌గా

Advertiesment
Khatrina kaif
హైదరాబాద్ , మంగళవారం, 23 మే 2017 (03:20 IST)
బాలీవుడ్‌ అందాల హీరోయిన్ కత్రినా కైఫ్‌ ఇన్‌స్టాగ్రామ్‌‌లో చేసే పోస్ట్‌లంటే అభిమానులకు ఎంతో ఆసక్తి. చిత్రీకరణ సమయాల్లో దిగిన ఫొటోలు, చిన్ననాటి ఫొటోలు పోస్ట్‌ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తుంటారు అయితే తాజాగా కత్రినా పోస్ట్‌ చేసిన ఓ ఫొటో మాత్రం వైరల్‌గా మారుతోంది. ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ సంస్థ తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోలీసు అధికారిణి ఫొటో పోస్ట్‌ చేస్తూ ఆమె గురించి ఇలా వివరించింది. 
 
‘నా సోదరులంతా పోలీసు ఉద్యోగాల్లో స్థిరపడినవారే. వారినిచూస్తూనే పెరిగాను. ఇక నాకు పోలీసు ఉద్యోగం ఎంచుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు కానిస్టేబుల్‌ అవ్వాలనుకున్నాను. ఎవరి మీదా ఆధారపడకుండా ఇతరులను సంరక్షిస్తూ నన్ను నేను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో. ఏదేమైనా ఈరోజుల్లో కొన్ని సంఘటనల కారణంగా పోలీసువ్యవస్థపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు నాటుకుపోతున్నాయి. 
 
అందరూమేము బద్ధకస్తులమని, అవినీతిపరులమని అత్యవసర సమయాల్లో 100కి డయల్‌ చేసినా పట్టించుకోరని అనుకుంటున్నారు. కానీ అలా వచ్చిన అత్యవసర ఫోన్లకు నేనే స్పందించాను. రాత్రి వేళల్లో ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిసిన వెంటనే నాకు నేనే ఓ వ్యాన్‌ నడుపుకొంటూ వెళ్తాను. కొన్ని ప్రదేశాల్లో నాకు తెలిసిన మహిళల్ని కాపలాగా పెట్టాను. ఎవరికైనా ఆపద వస్తే వారు నాకు ఒక్క ఫోన్‌ చేస్తారు. వెంటనే నేను స్పందిస్తాను. మీకే అవసరం వచ్చినా మేమున్నామని మర్చిపోకండి. మమ్మల్ని నమ్మండి. మీ నమ్మకాన్ని వమ్ముచేయం’ అని ఇన్‌స్టాగ్రామ్‌పోస్ట్‌లో రాసుంది.
 
ఈ ఫొటోను కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఫొటో పోస్ట్‌ చేసిన కొద్ది సేపట్లోనే లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేమా.. లవ్‌బర్డ్సా.. మాకే తెలియజేసినందుకు థ్యాంక్స్: పగలబడి నవ్వుకుంటున్న ఆ జంట