Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ఖైదీ నం.150" థర్డ్ సాంగ్... 'సాయంకాలానా.. సాగరతీరానా.. యు అండ్ మీ...' (ఆడియో)

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నం.150'. ఈ చిత్రంలోని మూడో పాటను యూట్యూబ్‌లో బుధవారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేశారు. ఈ చిత్రంలోని పాటల్లో ఇప్పటికే మూడు పాటలు విడుదలై హల్‌చల్ చేస్తు

Advertiesment
, గురువారం, 29 డిశెంబరు 2016 (15:45 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నం.150'. ఈ చిత్రంలోని మూడో పాటను యూట్యూబ్‌లో బుధవారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేశారు. ఈ చిత్రంలోని పాటల్లో ఇప్పటికే మూడు పాటలు విడుదలై హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పాటలతో పాటు.. టీజర్‌ యూట్యూబ్‌లో అద్భుత ఆదరణ పొందుతున్నాయి. వీటికి వచ్చిన రెస్పాన్స్‌ చూసి సినిమాపై మరింత ఆసక్తి క్రియేట్‌ అవుతోంది.
 
చాలా రోజుల తర్వాత మెగాస్టార్‌ చేసిన సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల వరకు ఈ సినిమా రికార్డు కలెక్షన్లు రాబట్టగలుగుతుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు దృష్టంతా ఓవర్సీస్‌ మీదే. మెగాస్టార్‌కు ఓవర్సీస్‌ మార్కెట్‌ పూర్తిగా కొత్త. ఎందుకంటే చిరంజీవి సినిమాల్లో టాప్‌ పొజిషన్లో ఉండే సమయానికి ఓవర్సీస్‌ మార్కెట్‌ ఉండేది కాదు. 
 
కానీ, ఈ మధ్య కాలంలో ఓవర్సీస్‌.. ముఖ్యంగా అమెరికా తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్‌గా మారింది. చిరు రీ ఎంట్రీ సినిమా కావడంతో అక్కడా ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. దాంతో ఈ సినిమాను రికార్డు స్థాయిలో అక్కడ 1.8 మిలియన్‌ డాలర్లు (12 కోట్ల రూపాయలు)కు అమ్మారు. మరి, ఖైదీ అక్కడా సత్తా చాటి కలెక్షన్ల వర్షం కురిపిస్తాడో, లేదో చూడాలి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో తరుణ్‌తో ప్రియమణి పెళ్లి.. నిజమేనా? ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్?