మరో జన్మంటూ ఉంటే 'జగన్'లా పుట్టాలి : 'ఖైదీ' దర్శకుడు వివి.వినాయక్
మరో జన్మంటూ ఉంటే జగన్‌లా పుట్టాలని ఉందని ఖైదీ నంబర్ 150వ చిత్ర దర్శకుడు వివి.వినాయక్ తన మనసులో మాటను వెల్లడించారు. జగన్ అంటే వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కాదండీబాబూ... టాలీవుడ్ దర్శకు
మరో జన్మంటూ ఉంటే జగన్‌లా పుట్టాలని ఉందని ఖైదీ నంబర్ 150వ చిత్ర దర్శకుడు వివి.వినాయక్ తన మనసులో మాటను వెల్లడించారు. జగన్ అంటే వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కాదండీబాబూ... టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్.
అక్కినేని అఖిల్‌తో నిర్మించిన అఖిల్ చిత్రం భారీ డిజాస్టర్‌తో వినాయక్ చాలా ఇబ్బంది పడ్డారు. కానీ, ఇపుడు మెగాస్టార్ చిరంజీవితో 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. మెగా అభిమానులతో పాటు ఎంతో మంది సినీ జనాలు వినాయక్ సినిమాపై ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. ‘ఖైదీ’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తనతోపాటే సినీ కెరీర్ ప్రారంభించిన మరో ఇద్దరు దర్శకులతో తనకున్న అనుబంధాన్ని, చనవును వెల్లడించాడు.
ఆ ఇద్దరూ దర్శకులు మరెవరో కాదు.. ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ఎవరెస్టుకు ఎక్కించిన దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి, ఆరు నెలల్లోనే అద్భుతమైన సినిమా తీసిపడేసే పూరీ జగన్నాథ్. ఈ ఇద్దరి గురించి వినాయక్ ఏం చెప్పారనేది ఆయన మాటల్లోనే..
'మేమేం ముగ్గురం చాలా బాగుంటాం. రాజమౌళితో నేను కలవడం ఫ్యామిలీ గ్యాదెరింగ్‌లా ఉంటుంది. సరదాగా ఉంటాం. రాజమౌళికి కానీ, కీరవాణికి కాని నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా నేను వాళ్లింటికి వెళ్తే.. ‘హే వినయ్ గారు వచ్చారు’ అని చాలా ఆనందంగా ఫీలవుతారు. నాకది చాలా ఇష్టం. జగన్‌లో ఏంటంటే.. రాజమౌళి కొంచెం కూల్. కానీ జగన్ అలా కాదు. నాకు నచ్చేది ఏంటంటే.. లోలో ఉన్నప్పుడు జగన్‌ను తలచుకోవాలనిపిస్తుంది. అసలు భయం కానీ, కేర్ కానీ ఏమీ ఉండదు. ఎప్పుడూ బిందాస్‌గా ఉంటాడు. మళ్లీ జన్మంటూ ఉంటే జగన్‌లా పుట్టాలి' అని మనసులోని మాటను వెల్లడించాడు.