Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖైదీ నెం.150 సినిమా వసూళ్లు అదుర్స్: వారం రోజుల్లో రూ.108.48 కోట్ల కలెక్షన్స్..

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం.150 సినిమా వసూళ్లను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. తొలివారం కలెక్షన్లు రూ.108.48కోట్లుగా నమోదైనట్లు చెప్పారు. టాలీవుడ్‌లో వేగంగా వంద కోట్లు రాబట్టిన

ఖైదీ నెం.150 సినిమా వసూళ్లు అదుర్స్: వారం రోజుల్లో రూ.108.48 కోట్ల కలెక్షన్స్..
, గురువారం, 19 జనవరి 2017 (10:07 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం.150 సినిమా వసూళ్లను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. తొలివారం కలెక్షన్లు రూ.108.48కోట్లుగా నమోదైనట్లు చెప్పారు. టాలీవుడ్‌లో వేగంగా వంద కోట్లు రాబట్టిన సినిమా ఇదేనని.. ఇప్పటికే విడుదలైన కొన్ని సెంటర్లలో కొన్ని సెంటర్లలో వసూళ్లు బలంగా వున్నాయని తెలిపారు.
 
ఈ లెక్కన బాహుబలి తర్వాత తెలుగులో బాక్సాఫీసు వద్ద అత్యధికంగా కాసుల పంట పండించిన ఫిల్మ్ ఇదేనని చెప్పుకొచ్చారు. అలాగే ఆంధ్రాలోని కొన్నిచోట్ల బాహుబలి రికార్డులను ఖైదీ అధిగమించిందని ఇన్‌సైడ్ సమాచారం. కొణెదల బ్యానర్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలు కొట్టడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. 
 
హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. చిరంజీవి అభిమానులతో పంచుకునే మంచి శుభవార్త ఉందని అన్నారు. తర్వాత కర్ణాటక రాష్ట్రంలో 9 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని అన్నారు. ఇక, నార్త్ ఇండియాలో కోటీ 43 లక్షల రూపాయలు వసూలు చేసిందని, నార్త్ అమెరికా 17 కోట్ల రూపాయలు వసూలు చేసిందని, వెస్ట్ అమెరికా 3 కోట్ల 90 లక్షల రూపాయల, ఒడిశా 40 లక్షలు, తమిళనాడు 60 లక్షల రూపాయలు వసూలు చేసిందని అన్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా తొలి ఏడు రోజుల్లో ఈ సినిమా 108.48 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్పుకొచ్చారు. 
 
ఇంకా ఖైదీ 150 హైయెస్ట్ గ్రాస్ వేగంగా సాధించిన తొలి తెలుగు సినిమాగా ఇది రికార్డు సాధించిందని తెలిపారు. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ అల్లు అరవింద్ ధన్యవాదాలు చెప్పారు. వాస్తవానికి ఈ విషయం నిర్మాత వెల్లడించాలని, అయితే త్వరలోనే రామ్ చరణ్ కృతజ్ఞతాభినందన సభ నిర్వహిస్తారని వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరును ఆకాశానికెత్తిన వర్మ.. మెగాస్టార్.. మెగా.. మెగా.. మెగా.. ఫెంటాస్టిక్ అంటూ ట్వీట్