గల్ఫ్‌లో చిరు సినిమా సందడి ... 60కి పైగా థియేటర్లలో విడుదల
మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమా గల్ఫ్ దేశాల్లోనూ సందడి చేస్తోంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 60కు పైగా థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. అక్కడి తెలుగువారిలో కొందరు.. తెలుగ
మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమా గల్ఫ్ దేశాల్లోనూ సందడి చేస్తోంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 60కు పైగా థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. అక్కడి తెలుగువారిలో కొందరు.. తెలుగు రాష్ట్రాల్లోని వారి కంటే ముందే ఈ సినిమా చూసేశారు. మంగళవారం రాత్రి దుబాయ్‌లో ప్రీమియర్ షోలు వేయగా పెద్ద సంఖ్యలో అభిమానులు తిలకించారు.
ఇక.. ఈ సినిమాను ప్రదర్శిస్తున్న హాళ్ల వద్ద చిరంజీవి అభిమాని, వ్యాపారవేత్త కేసరి త్రిమూర్తుల అధ్వర్యంలో కేకులు కోసి మరీ సంబరాలను జరుపుకొన్నారు. సినిమాకు వచ్చిన టాక్ దష్ట్యా మరో వారం రోజుల వరకూ టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. అలాగే, దుబాయ్, యూఏఈల్లో 36 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒమాన్‌లో 10 థియేటర్లలో దీన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక.. ఈ సినిమా చూడ్డానికి తమ ఉద్యోగులందరికీ సెలవు ఇచ్చేసినట్లు అల్ రియాధ్ కంపెనీ యాజమాని, మెగాస్టార్ అభిమాని అయిన రాందాస్ చందక చెప్పారు. కువైత్‌లో 7, బహ్రెయిన్ లో 5, ఖతర్‌లో 7 థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.