Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఈ సుందరి మల్లి తీగలా...' కాజల్ అందాన్ని వర్ణిస్తూ "ఖైదీ నం.150" సాంగ్ (ఆడియో)

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం ఆడియోలో భాగంగా, ఇప్పటికే మొదటి పాటను విడుదల చేశారు.. 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' పేరుతో ఈ ఆడియో సాంగ్ యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. పక్కా మాస్ స

Advertiesment
'ఈ సుందరి మల్లి తీగలా...' కాజల్ అందాన్ని వర్ణిస్తూ
, సోమవారం, 26 డిశెంబరు 2016 (12:20 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం ఆడియోలో భాగంగా, ఇప్పటికే మొదటి పాటను విడుదల చేశారు.. 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' పేరుతో ఈ ఆడియో సాంగ్ యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. పక్కా మాస్ సాంగ్‌గా సాగే ఈ పాటకు నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు. 
 
ఈ నేపథ్యంలో క్రిస్మస్ పండగను పురస్కరించుకుని ఆదివారం ఈ చిత్రంలోని మరో ఆడియో సాంగ్ రిలీజైంది. ఇందులో కాజల్‌ని వర్ణిస్తూ పాడిన పాట ఇది. దీనికి సినీ లవర్స్ నుంచి స్పందన బాగానే వస్తోంది. గతంలో 'అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ' పాటకూ ఊహించని రెస్పాన్స్ రావడంతోనే దీన్ని రిలీజ్ చేసినట్టు యూనిట్ చెబుతున్నమాట. 
 
ఆడియో రిలీజ్ ఫంక్షన్ లేకపోవడంతో ఒక్కో సాంగ్స్‌ని రిలీజ్ చేస్తూ సినిమాకి హైప్‌ని క్రియేట్ చేస్తున్నట్లు చిరు ఫ్యాన్స్‌లోని ఓ వర్గం చెబుతున్నమాట. మరి అమ్మడు సాంగ్‌ని "ఈ సుందరి మల్లి తీగ" అధిగమిస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రంలో హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ కాగా, వీవీ వినాయక్ దర్శకుడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లికి ముందు నమ్రతతో నాలుగేళ్లు డేటింగ్ చేసిన మహేష్ బాబు!?