ఖైదీ నెం.150 మానియా: ఆ మూడు టిక్కెట్ల రేటెంతో తెలుసా? తెలిస్తే షాకవ్వాల్సిందే
మెగాస్టార్ చిరంజీవి కరిష్మా ఏమాత్రం తగ్గలేదు. మెగాస్టార్ 150వ సినిమా ఖైదీ నెం.150 బాక్సాఫీసు రికార్డులను బద్ధలు కొట్టేస్తోంది. ఖైదీ 150వ సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్ 3 టిక్కెట్లను అత్యధిక రేటు..
మెగాస్టార్ చిరంజీవి కరిష్మా ఏమాత్రం తగ్గలేదు. మెగాస్టార్ 150వ సినిమా ఖైదీ నెం.150 బాక్సాఫీసు రికార్డులను బద్ధలు కొట్టేస్తోంది. ఖైదీ 150వ సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్ 3 టిక్కెట్లను అత్యధిక రేటు.. రూ.36 లక్షలకు విక్రయించింది. మొదట టికెట్లను వేలం వేయగా మెగాస్టార్ వీరాభిమాని ఒకరు ఈ మూడు టికెట్లను రూ.36 లక్షలకు చేజిక్కించుకున్నాడు.
దాదాపు పదేళ్ల గ్యాప్‌కు తర్వాత చిరు ఫ్యాన్స్ తమ ఏకైక హీరోగానే భావిస్తున్నారనేందుకు ఇదే నిదర్శనమని ఆ థియేటర్ యాజమాన్యం అంటోంది. ఇక రూ.36లక్షలను ఓ ఛారిటీకి అందజేస్తామని.. నిజంగా ఇది రికార్డేనని థియేటర్ యాజమాన్యం వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. 'ఖైదీ నంబర్ 150' సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ట్వీట్ చేశారు. అల్లు అర్జున్, హరీశ్ శంకర్, అల్లు శిరీష్ తదితరులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మోహన్‌బాబు, అక్కినేని నాగార్జున, రామ్, మంచు మనోజ్ తదితరులు చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు.
లెట్స్ డు రికార్డ్స్ కుమ్ముడు అంటూ బన్నీ ట్వీట్ చేశాడు.
* హరీశ్ శంకర్: 'బాక్సాఫీసులు బద్దలు.. అన్ని ఏరియాలనూ రఫ్ అడిస్తున్న మెగాస్టార్..' అని ట్వీట్ చేశారు.
* అల్లు శిరీష్: 'మెగా సర్జికల్ స్ట్రైక్' అని ట్వీట్ చేశారు.