Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భావన వేధింపులపై ప్రూఫ్ అడుగుతున్న ఎమ్మెల్యే.. మలయాళీ బొమ్మాళీలు ఫైర్

మలయాళ సినీ హీరోయిన్ భావనపై లైంగిక వేధింపులు కుట్రలో భాగస్వామి, తోటి నటుడు దిలీప్‌లో పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెడితే అతడికి మద్దతుగా నిలిచిన కేరళ ఎమ్మల్యే ఒకరు భావనపై అత్యాచారం జరిగిందనడానికి రుజువేది అని ప్రశ్నించి సంచలనం రేపాడు. భావన నిజంగా అత్య

Advertiesment
kerala
హైదరాబాద్ , గురువారం, 3 ఆగస్టు 2017 (03:13 IST)
మలయాళ సినీ హీరోయిన్ భావనపై లైంగిక వేధింపులు కుట్రలో భాగస్వామి, తోటి నటుడు దిలీప్‌లో పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెడితే అతడికి మద్దతుగా నిలిచిన కేరళ ఎమ్మల్యే ఒకరు భావనపై అత్యాచారం జరిగిందనడానికి రుజువేది అని ప్రశ్నించి సంచలనం రేపాడు. భావన నిజంగా అత్యాచారానికి గురై ఉంటే ఆ మరుసటి రోజే ఆమె షూటింగ్‌కు ఎలా వెళ్లింది అంటూ ఈ ప్రబుద్ధుడు వేసిన ప్రశ్నతో కేరళ మహిళాలోకం మండిపడుతోంది. దిలీప్‌ను మతపరంగా చూస్తూ మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యే జార్జిపై చర్యలు తీసుకోవాలని  కేరళ సినీరంగ మహిళా సంఘం తీవ్రంగా స్పందించింది.
 
మలయాళ సినీ నటి భావనపై అత్యాచారం కేసులో నటుడు దిలీప్‌ను వెనకేసుకొస్తున్న జార్జి బుధవారం విలేకరులతో మాట్లాడారు. 'అత్యాచారానికి గురైన మహిళ తర్వాత రోజు పనిలోకి ఎలా వెళ్లింది’ అని కేరళ శాసనసభ్యుడు పీసీ జార్జి ప్రశ్నించారు. ‘పోలీసులు కోర్టులో చెప్పినట్లు ఆ నటిపై దారుణంగా అత్యాచారం జరిగి ఉంటే తర్వాత రోజు నటించడానికి ఎలా వెళ్లింది’ అని అడిగారు. ఈ కేసులో జైలులో ఉన్న దిలీప్‌కు మద్దతు కోరుతూ.. అతను కుట్రకు బలయ్యాడని పేర్కొన్నారు. 
 
జార్జి వ్యాఖ్యలపై సినీ రంగ మహిళల సంఘం తీవ్రంగా స్పందించింది. ఆయనపై చర్య తీసుకోవాలని కేరళ స్పీకర్‌ను కోరాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ చిత్రంలో శృంగారం - రక్తపాతం, 48 సీన్లు కట్... ఇక సినిమా తీయడం ఎందుకు?