Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలీవుడ్ సినిమాలో కీర్తి సురేష్.. వరుణ్ ధావన్‌తో షూటింగ్

Advertiesment
keethi suresh

సెల్వి

, గురువారం, 1 ఫిబ్రవరి 2024 (12:01 IST)
అందాల తార కీర్తి సురేష్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఆమె ఒక హిందీ సినిమా, వెబ్ సిరీస్ కోసం సైన్ చేసింది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తోన్న తన మొదటి హిందీ చిత్రం కోసం పని చేయడం ప్రారంభించింది. 
 
దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ఓ ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్‌ని ఏలాలని భావిస్తోంది. ఆమె ప్రస్తుతం ముంబైకి మకాం మార్చింది. వరుణ్ ధావన్ 18వ చిత్రం #VD18 పేరుతో షూటింగ్ జరుపుకుంటోంది. 
 
ఈ సినిమాలో పనిచేయడం కోసం ఆమె ముంబైకి వెళ్లింది. ఇందులో భాగంగా తన మొదటి బాలీవుడ్ చిత్రం పనిని ప్రారంభించినట్లు ధృవీకరిస్తూ కొత్త ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ హిందీ ప్రాజెక్ట్‌ను పక్కన పెడితే, ఆమెకు యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న "అక్క" అనే వెబ్ సిరీస్ చేస్తోంది. 
 
కీర్తి సురేష్ తన తదుపరి తెలుగు చిత్రాలను ఇంకా ప్రకటించలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ టికెట్ రిలీజ్ చేసి అంబాజీపేట టీంను అభినందించిన విజయ్ దేవరకొండ