Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెమ్యునరేషన్ పెరగాలంటే టాలీవుడే దిక్కట.. ఆమెకు లక్కూ.. వీళ్లకు ఝలక్కూ..!

దక్షిణాది భాషా చిత్రాల్లో ఎవరైనా రెమ్యునరేషన్ పెంచుకోవాలంటే వారు తప్పక టాలీవుడ్‌కి రావలిసిందేనా.. టాలీవుడ్‌లో ఇప్పుడే కాలుపెట్టిన కీర్తి సురేష్ ఆ మాట నిజమేనంటోంది మరి. రెండు తమిళ హిట్ చిత్రాల్లో కూడా రాని ఫేమ్, రాని రెమ్యునరేషన్ తెలుగు చిత్రరంగంలోకి

Advertiesment
రెమ్యునరేషన్ పెరగాలంటే టాలీవుడే దిక్కట.. ఆమెకు లక్కూ.. వీళ్లకు ఝలక్కూ..!
హైదరాబాద్ , బుధవారం, 12 ఏప్రియల్ 2017 (05:27 IST)
దక్షిణాది భాషా చిత్రాల్లో ఎవరైనా రెమ్యునరేషన్ పెంచుకోవాలంటే వారు తప్పక టాలీవుడ్‌కి రావలిసిందేనా.. టాలీవుడ్‌లో ఇప్పుడే కాలుపెట్టిన కీర్తి సురేష్ ఆ మాట నిజమేనంటోంది మరి. రెండు తమిళ హిట్ చిత్రాల్లో కూడా రాని ఫేమ్, రాని రెమ్యునరేషన్ తెలుగు చిత్రరంగంలోకి ఇలా అడుగుపెట్టిందో లేదో నడుచుకుంటూ వచ్చేసింది. ఒక సినిమా చాన్సుతో మూడు కోట్ల రెమ్యునరేషన్ కొట్టేసిన కీర్తి సురేష్‌ని చూసి టాలీవుడ్, కొలివుడ్, మల్లువుడ్ హీరోయిన్లు నోరు తెరిచేస్తున్నారు మరి.
 
తాజాగా పవన్‌ కల్యాణ్‌కు జంటగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటించే లక్కీచాన్స్‌ను కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కనున్న ద్విభాషా( తమిళం, తెలుగు) చిత్రంలో ఆ మహానటిగా నటించే అదృష్టం కీర్తీనే వరించింది. కోటి నుంచి కోటిన్నర, రెండు కోట్లు అంటూ తన పారితోషికాన్ని పెంచుకుంటూ వస్తున్న కీర్తీసురేశ్‌ సావిత్రి జీవిత కథ ద్విభాషా చిత్రం కావడంతో తమిళం, తెలుగు భాషలకు కలిసి మూడు కోట్లు పారితోషికం ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేసిందట. నిర్మాత కూడా అందుకు అంగీకరించినట్లు సమాచారం. 
 
దీంతో తమిళ దర్శక, నిర్మాతలకు తన చిత్రాలకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి డిమాండ్‌ ఉంటోంది కాబట్టి మీరూ తన పారితోషికం మూడు కోట్లకు తక్కువ కాకుండా చూసుకోండని అంటోందట. ప్రస్తుతం టాప్‌ హీరోయిన్లుగా రాణిస్తున్న నయనతార, అనుష్క వంటి వారే చాలా కాలం పోరాడి మూడు కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకోగా, కేవలం నాలుగైదు చిత్రాలతోనే కీర్తీసురేశ్‌ అంత పారితోషికం డిమాండ్‌ చేయడాన్ని తమిళ నిర్మాతలు జీర్ణించుకోలేకపోతున్నట్లు టాక్‌. 
 
ఇదు ఎన్న మాయం చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన మాలీవుడ్‌ బ్యూటీ కీర్తీసురేశ్‌. ఆ చిత్రం ఓకే అనిపించుకున్నా, ఆ తరువాత నటించిన రజనీమురుగన్, రెమో చిత్రాలు విశేష ప్రేక్షకాదరణను పొందాయి. దీంతో యమ క్రేజ్‌ను తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకు అనూహ్యంగా ఇళయదళపతితో భైరవా చిత్రంలో రొమాన్స్‌ చేసే అవకాశం వరించింది. అంతకు ముందే ధనుష్‌తో తొడరి చిత్రంలో నటించి తన వరకూ మంచి మార్కులు కొట్టేసింది. 
 
ఇప్పుడు కన్నడ చిత్రం మినహా దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెమ్యునరేషన్ పరంగా తేరిపార చూడలేనంత ఎత్తులో ఉన్న ఏకైక వర్ధమాన హీరోయిన్ కీర్తి సురేషే మరి
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ ఆవిడకు విడాకుల్వివండి చాలు...