Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

అనుష్క ఎక్కడ ఇబ్బంది పడుతోందో అక్కడే మేలుకున్నా.. కీర్తి సంబరం

అప్పటికీ, ఇప్పటికీ, ఇప్పటికీ దక్షిణాది ఎవర్ గ్రీన్ హీరోయిన్ సావిత్రి పాత్రను పోషించే అవకాశం వర్థమాన తార కీర్తి సురేష్‌కు రావడంతో ఆమె ఎగిరి గంతేసి ఒప్పుకుంది కానీ సావిత్రిలాగా బొద్దుగా కావడానికి అనుష్కను మాత్రం ఎన్నటికీ ఆదర్శంగా తీసుకోకూడదని ఫిక్స్ అ

Advertiesment
keerthi suresh
చెన్నై , శనివారం, 1 జులై 2017 (04:27 IST)
అప్పటికీ, ఇప్పటికీ, ఇప్పటికీ దక్షిణాది ఎవర్ గ్రీన్ హీరోయిన్  సావిత్రి పాత్రను పోషించే అవకాశం వర్థమాన తార కీర్తి సురేష్‌కు రావడంతో ఆమె ఎగిరి గంతేసి ఒప్పుకుంది కానీ సావిత్రిలాగా బొద్దుగా కావడానికి అనుష్కను మాత్రం ఎన్నటికీ ఆదర్శంగా తీసుకోకూడదని ఫిక్స్ అయిపోయిందట. సైజ్ జీరో చిత్రంకోసం అనుష్క ఎంత సాహసం చేసిందంటే దాని ఫలితంగా 80 కేజీల బరువు పెంచుకుని సంవత్సర కాలంగా ఆ బరువును తగ్గించుకోవడానికి నానా తిప్పలూ పడుతోంది. ఆ లావుబాధ తనకు రాకూడదని నిర్ణయించుకున్న కీర్తి ఈ విషయంలో కమల్ హసన్‌నే ఆదర్శంగా తీసుకుందట. అవ్వై షణ్ముఖి చిత్రం కోసం 20 ఏళ్ల క్రితం కమల్ హసన్ లావు కావడానికి ప్రోస్థేటిక్ మేకప్‌ ఉపయోగించి ఆంటీగా మారి అలరించారు. సరిగ్గా ఈ టెక్నాలజీని వాడి సావిత్రిలా బొద్దుగా కనిపించడానికి కీర్తి సిద్ధమైపోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. మహానటి సావిత్రి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తెలుగు, తమిళంలో సినిమా తిస్తున్నారు. ఈ పాత్రలో యువ నటి కీర్తిసురేశ్ నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాకు తమిళంలో నటిగైయర్ తిలగం, తెలుగులో మహానటి అని పేర్లతో రూపొందిస్తున్నారు. యువ నటి కీర్తిసురేశ్ ఆ పాత్రలో ఎలా ఇముడుతారు అని చాలా మంది ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే సావిత్రి మొదట నుంచి కొంచెం బొద్దుగా ఉండేవారు. కానీ ఆ భామ సన్నగా ఉంటుంది. దీంతో కీర్తిని దర్శక నిర్మాతలు బాగా లావెక్కాలని చెప్పినట్లు సమాచారం. 
 
కీర్తి కూడా అందుకు అంగీకరించినట్లూ, కాదు నిరాకరించినట్లూ రకరకాల ప్రచారాలు సోషలో మీడియాలో షికార్లు చేస్తునే ఉన్నాయి. ఇంజి ఇడుప్పళగి (సైజ్ జీరో) చిత్రం కోసం నటి అనుష్క బరువును సుమారు 80 కేజీల వరకూ పెంచుకున్నారు. అలాగే కీర్తిసురేశ్ కూడా సావిత్రి పాత్ర కోసం బరువు పెంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై బ్యూటీ ఇటీవల ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. సావిత్రిలా మారడానికి తాను లావవ్వలేదని చెప్పింది. 
 
ప్రోస్థేటిక్ మేకప్ ద్వారా తాను సావిత్రిలా బొద్దుగా మారుతున్నట్లు  చెప్పుకొచ్చింది. విశ్వనటుడు కమలహాసన్ అవ్వై షణ్ముగి చిత్రం కోసం ఆ మధ్య  ప్రోస్థేటిక్ మేకప్‌తోనే ఆంటీగా మారి అలరించారు. పాపం ఈ మేకప్ గురించి తెలియక నటి అనుష్క తన శరీరాన్ని భారీగా పెంచుకుని తరువాత తగ్గించుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. అయినా ఫలితం లేకపోయింది. బాహుబలి-2 చిత్రంలో అనుష్కను నాజూగ్గా చూపించడానికి దర్శకుడు రాజమౌళి రూ. కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. అనుష్క పరిస్థితిని గ్రహించే కీర్తిసురేశ్ బరువు పెరగరాదన్న నిర్ణయానికి వచ్చినట్లుంది.
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా... విషయాన్ని చూసి సెన్సార్ అదిరిపోయింది... ఆపలేకపోయింది...