Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్‌లో అదరగొట్టింది.. కానీ హౌస్ నుంచి ఓవియా అవుట్: వైరల్ అవుతున్న ''వీడియో'' చూడండి బాస్...

తమిళ బిగ్ బాస్‌లో అంతా తానై అదరగొట్టిన సినీ నటి ఓవియా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో లేకపోయినా.. ఆమె పేరు మారిమోగుతోంది. ఓవియా ఇంతవరకు బిగ్ బాస్ షోలో అదరగొట్టిన సీన్లన్నీ.. ప్రస్తుతం వీడియో రూపంలో వైరల్

Advertiesment
బిగ్ బాస్‌లో అదరగొట్టింది.. కానీ హౌస్ నుంచి ఓవియా అవుట్: వైరల్ అవుతున్న ''వీడియో'' చూడండి బాస్...
, మంగళవారం, 8 ఆగస్టు 2017 (13:43 IST)
తమిళ బిగ్ బాస్‌లో అంతా తానై అదరగొట్టిన సినీ నటి ఓవియా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో లేకపోయినా.. ఆమె పేరు మారిమోగుతోంది. ఓవియా ఇంతవరకు బిగ్ బాస్ షోలో అదరగొట్టిన సీన్లన్నీ.. ప్రస్తుతం వీడియో రూపంలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన ఓవియాకు సంబంధించిన ఓ వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. 
 
బిగ్ బాస్ ప్రారంభం నుంచే కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఓవియా... షోలో ఓవరాక్షన్ చేయకుండా, ఇతరుల కోసం తనను మార్చుకోకుండా.. ఓపెన్‌గా తనకు తోచిన విషయాన్ని బయటపెట్టేది. ఎప్పుడూ నవ్వుకుంటూ బిగ్ బాస్ హౌస్‌లో కలియ తిరిగేది. ఓవియా ఉన్నంతకాలం బిగ్ బాస్ షో ఎంటర్‌‍టైన్‌మెంట్ అదిరిపోయింది. కానీ ప్రస్తుతం ఓవియా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. దీంతో ఆమె కోసమే బిగ్ బాస్ చూసే ప్రేక్షకులను ఎంతగానో నిరాశపరిచింది. 
 
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కార్యక్రమంలో ఓవియా ఉన్నప్పుడు జరిగిన సన్నివేశాలను ఓ వీడియో రూపంలో విజయ్ టీవీ విడుదల చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను విజయ్ టీవీ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో కీప్ రాకింగ్ గర్ల్ అనే టైటిల్‌తో పోస్ట్ చేసింది. ఆ వీడియోకు ఇప్పటి వరకు 277,649 వ్యూస్ లభించాయి. మీరూ చూడండి బాస్...

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిచ్చెక్కిస్తున్న నర్గిస్ ఫక్రి... ఈత కొలనులో ఏం చేస్తుందో చూడండి...(Video)