భార్యతో కలిసి అమెరికాలో ల్యాండైన పవన్ కళ్యాణ్.. ఎందుకు!
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి అమెరికాలో ల్యాండయ్యారు. ప్రస్తుతం పవన్ ‘కాటమరాయుడు’ షూటింగ్‌లో బిజీగా గడుపుతూ వచ్చారు. అయితే, ఈ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చి అమెరికాలో వాలిపోయార
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి అమెరికాలో ల్యాండయ్యారు. ప్రస్తుతం పవన్ ‘కాటమరాయుడు’ షూటింగ్‌లో బిజీగా గడుపుతూ వచ్చారు. అయితే, ఈ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చి అమెరికాలో వాలిపోయారు.
ఈ నెల 11, 12 తేదీలలో ప్రఖ్యాత హార్వార్డ్ యూనివర్సిటీలో జరుగనున్న ‘ఇండియా కాన్ఫరెన్స్ 2017’ సమావేశంలో ప్రసంగించడానికి అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. అమెరికాలోని బోస్టన్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన పవన్‌కు ఘనస్వాగతం లభించింది.
పవన్‌తో పాటు ఈ సమావేశానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిల్ గేట్స్, ఫేస్‌బుక్ వ్యవస్థాకుడు మార్క్ జుకెర్‌బర్గ్ వంటి మహామహులు హాజరుకానున్నారు.
కాగా, పవన్ ఈ సమావేశాలకు ఖాదీ దుస్తులతోనే హాజరుకానున్నట్టు సమాచారం. బోస్టన్ ఎయిర్‌పోర్టులో పవన్‌తోపాటు అతని సన్నిహితుడు శరద్ మరార్ ఉన్నారు. అంతేకాదు పవన్‌తో కలిసి ఎప్పుడూ బయటకు రాని అతని భార్య అన్నా లెజ్‌నెవ్ ఈ పర్యటనలో ఉండటం గమనార్హం.