Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిలిం స్కూల్ కు కాశినాధుని విశ్వనాథ్ అవార్డు

Advertiesment
Nagarjuna, Amala, Nagendra, Lakshmi, Pranav

డీవీ

, సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (16:58 IST)
Nagarjuna, Amala, Nagendra, Lakshmi, Pranav
కళాతపస్వి శ్రీ కాశీనాధుని విశ్వనాథ్ గారి గౌరవప్రదమైన వారసత్వాన్ని పురస్కరించుకుని, శ్రీ అక్కినేని నాగేశ్వరరావుగారితో ఆయనకు అనుబంధాన్ని స్మరించుకుంటూ, విశ్వనాథ్ కుమారుడు శ్రీ కె నాగేంద్రనాథ్, వారి కుటుంబ సభ్యులతో కలసి ప్రతిష్టాత్మక వార్షిక 'కాశినాధుని విశ్వనాథ్ అవార్డు' ప్రకటించారు.
 
ప్రభావవంతమైన, అర్థవంతమైన సినిమాని రూపొందించడానికి స్ఫూర్తిని ఇచ్చే లక్ష్యంతో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకు చెందిన ఇద్దరు విద్యార్థులకు ఈ అవార్డును అందిస్తున్నారు. పరిశ్రమ ప్రముఖులచే నిర్దేశించబడిన ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబిస్తూ సౌండ్ డిజైన్,  డైరెక్షన్ రంగాలలో అసాధారణమైన నైపుణ్యాన్ని ప్రదర్శించే ఇద్దరు విద్యార్థులను సత్కరిస్తున్నారు. ప్రతి సంవత్సరం, ఈ అవార్డు ద్వారా ఇద్దరు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.25,000/- (మొత్తం యాభై వేల రూపాయలు) అందజేస్తారు.
 
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోని అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం వద్ద అక్కినేని నాగార్జున, అమల తో విశ్వనాథ్ గారి కుమారుడు నాగేంద్ర, అతని భార్య లక్ష్మి, కొడుకు ప్రణవ్ కలిశారు.  
 
విద్యార్థులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అధ్యాపకులు, విద్యను అందించాలనే లక్ష్యంతో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాను 2011లో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని కుటుంబం స్థాపించారు. ఇప్పుడు ఒక దశాబ్దానికి పైగా కాలేజ్  ఫిల్మ్ ఎడ్యుకేషన్ లో ముందంజలో ఉంది, నెక్స్ట్ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ ని అందిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇద్దరు ఫ్రండ్స్ కృష్ణార్జునులైతే.. కాన్సెప్ట్ తో హద్దు లేదురా మూవీ చిత్రీకరణ