Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్తికేయ, నేహా శెట్టిల బెదురులంక 2012 రాబోతుంది

Advertiesment
Karthikeya, Neha Shetty
, శుక్రవారం, 7 జులై 2023 (19:15 IST)
Karthikeya, Neha Shetty
కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'బెదురులంక 2012'. ఆయన సరసన 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించారు. ఈ చిత్రాన్ని లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు.  'బెదురులంక 2012' చిత్రాన్ని ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఈ రోజు వెల్లడించారు. 
 
చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ ''అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది. కొత్త కంటెంట్, బ్యూటిఫుల్ విజువల్స్, మంచి పాటలతో మేం 'బెదురులంక 2012' తీశాం. ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళుతుందీ సినిమా. ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా ఉంటుంది. గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే 'బెదురులంక 2012' ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది'' అన్నారు.
 
దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ''ఇప్పటికే విడుదలైన టీజర్, పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు అందరూ సినిమా విడుదల ఎప్పుడు? ఎప్పుడు? అని అడుగుతున్నారు. ఆగస్టు 25న 'బెదురులంక 2012' ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపిస్తాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలో ట్రైలర్ విడుదల తేదీ వెల్లడించడంతో పాటు మిగతా పాటలను విడుదల చేస్తాం. మణిశర్మ గారు అద్భుతమైన బాణీలు అందించారు. పాటల్లోనూ, సన్నివేశాల్లోనూ కార్తికేయ, నేహా జోడీ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది'' అని అన్నారు.  
 
కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృథ్వీ కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల, పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ, ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు : అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ : సి. యువరాజ్, నిర్మాత : రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం : క్లాక్స్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రైమ్ వీడియో కొత్త తెలుగు సిరీస్ హాస్టల్ డేస్ ట్రైలర్‌ విడుదల