Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మళ్లీ పోలీస్ ఆఫీసరుగా కార్తీ.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్..

తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'విక్రమార్కుడు'పై మనసు పారేసుకుని ఆ సినిమా రీమేక్‌లో కార్తీ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం పోషించడంతోపాటు.. పోలీసుగా పవర్‌ఫుల్‌ ఎమోషన్‌ను వ

Advertiesment
Karthi-Rakul Preet Singh Cop Film Gets A Rocking Title
, శుక్రవారం, 23 డిశెంబరు 2016 (13:38 IST)
తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'విక్రమార్కుడు'పై మనసు పారేసుకుని ఆ సినిమా రీమేక్‌లో కార్తీ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం పోషించడంతోపాటు.. పోలీసుగా పవర్‌ఫుల్‌ ఎమోషన్‌ను వ్యక్తపరిచి ప్రేక్షకులకు దగ్గరైన కార్తీ.. ప్రస్తుతం భారీ ఆఫర్లతో దూసుకెళ్తున్నాడు. తాజాగా అన్నయ్య అయిన సూర్యలా మళ్లీ పోలీస్ ఆఫీసరుగా కనిపించబోతున్నాడు. 
 
ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలోని 'కాట్రు వెలియిడై'లో కార్తి నటిస్తున్నారు.  ఇది పూర్తికాగానే 'చదురంగవేట్టై' ఫేం వినోద్‌ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలోనే కార్తి పోలీసు అధికారిగా నటించనున్నారు. 
 
ఇందులో కార్తి సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయికగా సందడి చేయనుంది. దర్శకత్వంతోపాటు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే కూడా సమకూర్చుతున్నారు వినోద్‌. సినిమాటోగ్రాఫర్‌గా సత్య వ్యవహరిస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ జనవరి తొలివారం నుంచి ప్రారంభం కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంగా మరణ రహస్యం అమ్మలు గన్న అమ్మకే తెలుసు.. ఇదే వర్మ 'వంగవీటి' చిత్ర రివ్యూ