పవన్‌తో రాజకీయాల్లేవ్.. ఆశీర్వాదం కోసమే వచ్చాం : కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి
జనసేన అధినేత, టాలీవుడ్ అగ్రనటుడు పవన్ కల్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి శనివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య కొద్దిసేపు చర్చలు జరిగాయి.
జనసేన అధినేత, టాలీవుడ్ అగ్రనటుడు పవన్ కల్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి శనివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య కొద్దిసేపు చర్చలు జరిగాయి.
ఆ తర్వాత కుమార స్వామి మీడియాతో మాట్లాడుతూ... పవన్‌తో జరిగిన భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. చాలాకాలంగా తమ మధ్య స్నేహం ఉందన్నారు. తన కుమారుడు నిఖిల్ సినీరంగ ప్రవేశం గురించి పవన్ కల్యాణ్‌తో చర్చించానని కుమారస్వామి తెలిపారు. నిఖిల్‌ను పవన్ సొంత సోదరుడిగా భావిస్తారని ఆశిస్తున్నారన్నారు. కర్ణాటక, తెలంగాణ, ఏపీ ప్రజలు అన్నదమ్ముల్లాంటివారని ఆయన అన్నారు. ఏపీ రాజకీయాల్లో పవన్ ప్రాధాన్యత ఉంటుందని కుమారస్వామి వెల్లడించారు.
అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... తనకు కుమార స్వామికి మధ్య 8 ఏళ్ల నుంచి అనుబంధం ఉందన్నారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్ సినీ ప్రవేశం గురించి చర్చించామన్నారు. ప్రత్యేక హోదా అంశంపై తర్వాత మాట్లాడతానని పవన్‌కల్యాణ్ చెప్పారు.
కాగా, కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ నటించిన 'జాగ్వార్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. హెచ్.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది. ఎ. మహాదేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీప్తి కథానాయికగా నటించారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు.