Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మగాళ్లతో కలిసి కనిపించాలంటేనే భయం-షారూఖ్‌తో శృంగార సంబంధం లేదు: కరణ్ జోహార్

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ స్వలింగ సంపర్కుడని తన ఆత్మకథలో చెప్పడం.. ప్రస్తుతం సమస్యగా మారిపోయింది. ప్రస్తుతం కరణ్ జోహార్ మహిళా సెలెబ్రిటీలతో కలిసి కనిపించడంతో తిప్పలు విషయాన్ని పక్కనబెడితే..

మగాళ్లతో కలిసి కనిపించాలంటేనే భయం-షారూఖ్‌తో శృంగార సంబంధం లేదు: కరణ్ జోహార్
, సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (17:28 IST)
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ స్వలింగ సంపర్కుడని తన ఆత్మకథలో చెప్పడం.. ప్రస్తుతం సమస్యగా మారిపోయింది. ప్రస్తుతం కరణ్ జోహార్ మహిళా సెలెబ్రిటీలతో కలిసి కనిపించడంతో తిప్పలు విషయాన్ని పక్కనబెడితే.. మగాళ్లతో కలిసి కనిపించడం కూడా ఇబ్బందిగా మారిపోతుందట. ఎలాగంటే? కరణ్ జోహార్‌కు చాలామంది మగాళ్లతో శృంగార సంబంధాలు ఉన్నాయని బాలీవుడ్‌ మీడియా ఎప్పట్నుంచో వార్తలు, కథనాలు రాసేస్తున్నసంగతి తెలిసిందే. 
 
దీనిపై కరణ్ జోహార్ ఓ ఇంటర్వ్యూలో తన బాధను వెళ్లగక్కాడు. వీకెండ్స్‌లో జరిగే పార్టీల్లోగాని, ఫంక్షన్లలోగాని మగవారితో కలిసి కనిపించాలంటే భయమేస్తోందని తెలిపారు. అలా ఫోటోకు మగాళ్లకు కలిసి ఫోజిస్తే సోమవారం ఉదయానికే ఆ ఫోటోలను ఫ్రంట్‌ పేజీల్లో వేసేసి ఏదేదో రాసేస్తున్నారని వాపోయాడు. తనకు మేల్ సెలెబ్రిటీలకు సెక్సువల్‌ రిలేషన్‌షిప్‌ ఉందని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
ప్రత్యేకించి షారూఖ్‌తో తనకు సంబంధం ఉన్నట్లు రాసేస్తున్న వార్తలు తనను ఎంతగానో కలచివేశాయని చెప్పాడు. షారూఖ్ ఖాన్ తన తండ్రిలాంటి వాడని.. అతనితో తనను ముడిపెట్టి రాయడం ఎంతో బాధను మిగిల్చిందని కరణ్ పేర్కొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇదే నిజమైతే అటు ప్రిన్స్ ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ అల్లాడిపోతారేమో...?