టాలీవుడ్‌లో అక్టోబర్ 15వ తేదీన విడుదలైన కాంతార సినిమా కలెక్షన్లపరంగా దూసుకుపోతోంది. కాంతార జోరు ఇంకా తగ్గలేదు. ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది.
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాంగదుర్ నిర్మించారు. తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ 'గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్' ద్వారా విడుదల చేశారు. కాంతార చిత్రం విడుదలైన 2 వారాల్లోనే 45 కోట్లు వసూళ్లు సాధించి రికార్డు సాధించింది.
తాజాగా ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్ల పరంగా కుమ్మేయం రికార్డేనని సినీ పండితులు అంటున్నారు. కాంతార కేవలం తెలుగులోనే కాకుండాప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.