Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుండెపోటుతో మృతి చెందిన 'కన్నుల్లో నీ రూపమే' డైరెక్టర్

Advertiesment
kannullo Nee roopame
, సోమవారం, 31 మే 2021 (16:44 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నుల్లో నీ రూపమే చిత్రానికి దర్శకత్వం వహించిన యువ దర్శకుడు భిక్షపతి ఇరుసాడ్ల గుండెపోటుతో ఆదివారం రాత్రి కన్నుమూశాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు వున్నారు. ఆయనపైనే ఆధారపడి జీవిస్తున్న వృద్ధ తల్లిదండ్రులు కూడా వున్నారు.
 
భిక్షపతి ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో ఉద్యోగం చేసేవాడు. అక్కడ ఆయన జీవితం సాఫీగా సాగిపోయేది. కానీ సినీ రంగంపై ఉన్న మక్కువతో హైదరాబాద్‌ నగరానికి వచ్చాడు. ఆ తర్వాత 2018లో ‘కన్నుల్లో నీ రూపమే’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఐతే సినిమా అనుకున్న విధంగా ఆడలేదు. దీనితో విదేశాలకు సైతం తిరిగి పోలేక ములుగులోని దేవగిరిపట్నంలో జీవనం కొనసాగిస్తున్నారు.
 
అప్పట్నుంచి అనారోగ్య సమస్యలు కూడా ఆయన్ను వెంటాడుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోల్డెన్ టెంపుల్ అందం వ‌ర్ణించ‌లేనుః కంగ‌నా