Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక్క మగాడు మాట మీట నిలబడటం లేదు.. అందుకే ఈ పనిచేశా.. కనిష్కా

Advertiesment
kanishka soni
, శనివారం, 20 ఆగస్టు 2022 (13:40 IST)
ఒక్క మగాడు కూడా మాటమీద నిలబడటం లేదని, అందుకే తనను తాను పెళ్ళి చేసుకున్నట్టు నటి కనిష్కా సోనీ అన్నారు. తాజాగా ఆమె తనకు తానుగా పెళ్ళి చేసుకుంది. నదుట సింధూరం, మెడలో మంగళసూత్రంతో ఉన్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై ఆమె అభిమానులు ఆరా తీయగా, అసలు విషయాన్ని ఆమె బహిర్గతం చేసింది. తనను తానే పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు. 
 
పైగా, తాను ఎందుకు అలా చేశానో కూడా వివరించింది. తాను గుజరాతీ సంప్రదాయం ప్రకారం నుంచి వచ్చానని, పెళ్ళి అనేది తన చిరకాల కోరిక అని తెలిపింది. అయితే, తన జీవితంలో మాటమీద నిలబడే ఒక్క మగాడు కూడా కనిపించలేదని, అందుకనే పురుషుడి తోడు లేకుండానే జీవించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. 
 
పైగా, తన అవసరాలను తానే తీర్చుకోగలనని, కలలను నెరవేర్చుకోగలనని చెప్పారు. వివాహితులైన మహిళల్లో 90 శాతం మంది సంతోషంగా లేరన్నది వాస్తవమని చెప్పింది. 
 
కాగా, ఈ భామ "దియా ఔర్ బాతి హమ్" అనే టీవీ షోతో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. పైగా, "మహాబలి హనుమాన్" వంటి షోలలో దేవత పాత్ర పోషించినా రాని గుర్తింపు ఇపుడు లభిస్తుందని కనిష్క సంతోషం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సల్మాన్ ఖాన్ శాడిస్ట్.. అందరినీ కొట్టేవాడు.. సల్మాన్ మాజీ ప్రేయసి