Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దక్షిణాది యువరాణితో పోటీపడుతున్న ఉత్తరాది మహారాణి

కత్తి పట్టి తప్పడం అనేది నేర్చుకున్న తర్వాత ఆ కర ఖడ్గచాలనం పురుషుడిదా లేక స్త్రీదా అనే తేడా మనిషి చూడగలడమో కానీ కత్తి చూడలేదు. దానికి తెలిసిందల్లా ఎంత బలంగా శత్రువు గుండెల్లో తాను దిగాలనేదే. వీరుడు లేదా వీరనారి చేత ఒదిగిన తన కరకుతనం శత్రువును ఏ స్థాయ

Advertiesment
Rani Jhansi Lakshmi Bhai
హైదరాబాద్ , బుధవారం, 14 జూన్ 2017 (04:11 IST)
కత్తి పట్టి తప్పడం అనేది నేర్చుకున్న తర్వాత ఆ కర ఖడ్గచాలనం పురుషుడిదా లేక స్త్రీదా అనే తేడా మనిషి చూడగలడమో కానీ కత్తి చూడలేదు. దానికి తెలిసిందల్లా ఎంత బలంగా శత్రువు గుండెల్లో తాను దిగాలనేదే. వీరుడు లేదా వీరనారి చేత ఒదిగిన తన కరకుతనం శత్రువును ఏ స్థాయిలో అదరగొడుతునందనేది తెలుసుకోవాలనే. యుద్ధంలో రాజ్యక్షేమం కోసం పోరాడేది సైనికుడే కావచ్చు. కానీ ఆ సైనికుడి ధైర్యం అంతా ఆ రాజ్యాధినేత ధీరత్వం మీదే ఆధారపడి ఉంటుంది. 
 
అటువంటి ధీరత్వం కలిగిన రాణి కదన రంగంలో కత్తి దూసుకుంటూ వస్తుంటే శత్రువు కళ్ళలోనే కాదు, గుండెల్లోను ఓటమి భయం గుబులు రేపుతుంది. సరిగ్గా ఇలాంటి ధీరత్వం, శూరత్యం కలిగిన వీరనారి రాణి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ పాత్రలో నటించాలంటే అంత సులభం కాదు. అందుకు యుద్ధ విద్యల్లో ఎంతో నేర్పు, నైపుణ్యం ఉండాలి. 
 
కంగనా రనౌత్‌కు ఆ నైపుణ్యం ఉంది. రాణి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవిత కథ ఆధారంగా క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ‘మణికర్ణిక’లో ఆమె టైటిల్‌ రోల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా సక్సెస్‌ అయ్యేందుకు కంగనా ఏకాగ్రతతో యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నారు. ఈ సినిమా కోసం కంగనా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న ఫొటోలు బయటికొచ్చాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీదేవి రెండో కూతురుకి ఎంతైనా ఇస్తానంటున్న నాగ్...