పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మళ్లీ కంగనా రనౌత్.. లేడి ఓరియెంటెడ్ రోల్‌లో..
బాలీవుడ్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న కంగనా రనౌత్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకునే నటించనుందని తెలిసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న కంగనా రన
బాలీవుడ్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న కంగనా రనౌత్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకునే నటించనుందని తెలిసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న కంగనా రనౌత్, తెలుగులోనూ అదే తరహా సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తుంది. పూరీ జగన్నాథ్ కూడా జ్యోతిలక్ష్మీ తరహా కథతో కంగనాతో సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడట.
గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది కంగనా రనౌత్. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవటంతో తెలుగు సినిమా నాకు సరిపడదంటూ తిరిగి బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. ఇన్నేళ్ల తరువాత మరోసారి పూరి దర్శకత్వంలోనే తెలుగు సినిమాకు ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది.