Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా డ్రీమ్‌ డైరెక్టర్‌ ఈ భూమ్మీద లేరు : కంగనా రనౌత్

kangna ranaut

ఠాగూర్

, శుక్రవారం, 10 జనవరి 2025 (15:57 IST)
చిత్రపరిశ్రమలో ప్రస్తుతం మంచి దర్శకులు లేరని, అందుకే తాను దర్శకురాలిగా మారాల్సి వచ్చిందని బాలీవుడ్ నటి, లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్ అన్నారు. ముఖ్యంగా, హీరోయిన్ల పాత్రల చిత్రీకరణలో అగ్ర దర్శకులు సరైన ప్రతిభను కనబరచలేకపోతున్నారని మండిపడ్డారు. అలాగే, దక్షిణ భారత సినీ పరిశ్రమలో హీరోయిన్ల పాత్రల తీరుపై కూడా ఆమె అసహనం వ్యక్తం చేశారు.

ఇదే అంశంపై ఆమె తాజాగా మాట్లాడుతూ, 'మన చుట్టూ ఉన్న దర్శకుల తీరు నాకు నచ్చడం లేదు. నిజం చెప్పాలంటే మనకు గొప్ప దర్శకులు ఎవరూ లేరు. ఒకవేళ మనకే కనుక మంచి దర్శకులు ఉండి ఉంటే నేను దర్శకత్వం వైపు మొగ్గు చూపేదాన్ని కాదు. ఎవరినో తక్కువ చేయాలని ఇలా చెప్పడం లేదు. మనస్ఫూర్తిగా చెబుతున్నా. మీరు ఎవరితో వర్క్‌ చేయాలనుకుంటున్నారు? డ్రీమ్‌ డైరెక్టర్‌ ఎవరు? అని నన్ను ప్రశ్నిస్తే.. వారికి నేనిచ్చే సమాధానం ఒక్కటే. అలాంటి వారెవరూ ఇప్పుడు భూమ్మీద లేరు. భారీ చిత్రాలను తెరకెక్కించే దర్శకులు సైతం వారి సినిమాల్లో కథానాయికల పాత్రను అతి దారుణంగా చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో నేను ఎవరితోనూ వర్క్‌ చేయాలనుకోవడం లేదు' అని తెలిపారు.
 
'కెరీర్‌ ఆరంభంలో తాను ఎంతోమంది నూతన దర్శకులతో కలిసి వర్క్ చేశానని అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి చిత్రాలు తెరకెక్కించే దర్శకులు తగ్గిపోయారు. దర్శకత్వంలో రాణించాలనుకునేవారిని ప్రతిఒక్కరూ ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన చాలామంది తమ రక్తంలోనే యాక్టింగ్‌ ఉందని వ్యాఖ్యలు చేస్తారు. అలాంటి వాళ్లందరూ ఇప్పుడు దర్శకత్వం వైపు ఎందుకు అడుగులు వేయకూడదు. విలాసవంతమైన జీవితానికి వాళ్లు అలవాటు పడ్డారు. అందుకే ఇటువైపు చూడటం లేదు' అని కంగన అన్నారు.
 
కాగా, కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో ఇందిరా గాంధీ చరిత్ర ఆధారంగా ఎమర్జెన్సీ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ నెల 17వ తేదీన పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది. అనుపమ్ ఖేర్, మహిమా చౌదరిలు కీలక పాత్రలను పోషించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ కంటే ప్రియాంక తెలివైన నేత : కంగనా రనౌత్