కరణ్‌పై కసి? క్రిష్‌కు షాకింగ్ న్యూస్ చెప్పిన కంగనా రనౌత్... బాలీవుడ్ ఇండస్ట్రీ ఆశ్చర్యం
ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు చూస్తోంది. బాహుబలి హిట్ మానియాతో అక్కడి నటీనటులు ఇటువైపు దృష్టి సారిస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా పేరుగాంచిన కంగనా రనౌత్ నటిస్తున్న మణికర్ణిక చిత్ర కథను రాజమౌళి తండ్రి విజ
ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు చూస్తోంది. బాహుబలి హిట్ మానియాతో అక్కడి నటీనటులు ఇటువైపు దృష్టి సారిస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా పేరుగాంచిన కంగనా రనౌత్ నటిస్తున్న మణికర్ణిక చిత్ర కథను రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా కంగనా రనౌత్ నటిస్తోంది.
ఇదిలావుంటే కంగానాకు కరణ్ జోహార్ అంటే పడదు. కరణ్ బాహుబలి చిత్రం హక్కులు తీసుకుని కోట్ల మేర లాభపడిపోతున్నాడు. కరణ్ జోహార్ అంటే కంగనాకు ఎందుకో కానీ అస్సలు పడదు. ఈ నేపధ్యంలో ఆమె ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. తను నటించే ఆఖరి చిత్రం బహుశా మణికర్ణికే అవుతుందని క్రిష్‌కు చెప్పేసిందట. ఈ మాట విని క్రిష్ షాక్ తిన్నాడట.
ఆ తర్వాత తనే మాట్లాడుతూ... తను చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారట. దీన్నిబట్టి చూస్తుంటే భవిష్యత్తులో కరణ్ జోహార్‌కు పోటీగా ఈమె పూర్తిస్థాయి నిర్మాతగా మారిపోతుందేమో...?