Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ ఛాన్స్ ఓ ఛాలెంజ్ : కంగనా రనౌత్

Advertiesment
ఈ ఛాన్స్ ఓ ఛాలెంజ్ : కంగనా రనౌత్
, ఆదివారం, 6 జనవరి 2019 (16:58 IST)
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మణికర్ణిక చిత్రంతో ఈనెలాఖరులో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి ఆమె దర్శకత్వం వహించారు. నిజానికి ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాల్సి వుంది. కానీ, ఆయన కొన్ని అనివార్య కారణాల రీత్యా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్టును పూర్తిచేశారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, ఒక సినిమాకు దర్శకనటిగా వ్యవహరించడం అంత తేలికైన పని కాదని, అందుకు ఎంతో అంకితభావం అవసరమన్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 25వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన తమిళ ట్రైలర్‌ను చెన్నైలో  విడుదల చేశారు. 
 
ఈ కార్యక్రమంలో కంగనా రనౌత్‌, నిర్మాత కమల్‌జెయిన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంగనా రనౌత్‌ మాట్లాడుతూ 'ఒక సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తూనే, దర్శకురాలిగా ఉండటం చాలా కష్టమైన పని. కానీ నా అదృష్టం కొద్ది క్రిష్‌ సహాయం చెయ్యడం వల్ల కథపైన ఎక్కువ దృష్టి పెట్టాను. నటులు షాట్‌ అయిన తర్వాత కేరవన్‌లోకి వెళ్లి రిలాక్సవుతారు. కానీ దర్శకురాలిని కాబట్టి ఆ తర్వాత కెమెరా దగ్గరకు వచ్చి నుంచు నేదాన్ని' అని చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ పండ్లు ఆరగిస్తే కొలెస్ట్రాల్ మటుమాయం...