Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలుడుపై అత్యాచారం జరిపిన బాలీవుడ్ హీరోయిన్ హెయిర్‌స్టైలిస్ట్

వివాదాలకు కేరాఫ్‌గా మారిన కంగనా రనౌత్ మరోమారు వార్తలకెక్కింది. ఆమె వ్యక్తిగత హెయిర్‌స్టైలిష్ట్ ఓ బాలుడుపై అత్యాచారం చేశాడు. దీంతోఆయన్ను పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

బాలుడుపై అత్యాచారం జరిపిన బాలీవుడ్ హీరోయిన్ హెయిర్‌స్టైలిస్ట్
, ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (12:13 IST)
వివాదాలకు కేరాఫ్‌గా మారిన కంగనా రనౌత్ మరోమారు వార్తలకెక్కింది. ఆమె వ్యక్తిగత హెయిర్‌స్టైలిష్ట్ ఓ బాలుడుపై అత్యాచారం చేశాడు. దీంతోఆయన్ను పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
 
కంగనా హెయిర్‌స్టైలిస్ట్‌గా వ్య‌వ‌హ‌రించే బ్రెండ‌న్ అటెస్ట‌ర్ డిగీ(42) ఆమెతో పాటే ఉన్నాడు. అయితే ఓ బాలుడిని డిగీ అత్యాచారం చేసాడ‌ని తెలుసుకున్న పోలీసులు షూటింగ్ స్పాట్‌కి వెళ్లి అత‌డిని అదుపులోకి తీసుకున్నారు.
 
ఓ ప‌ద‌హారేళ్ళ బాలుడు ఓ డేటింగ్ యాప్ ద్వారా పురుష సెల‌బ్రిటీల‌తో రిలేష‌న్స్ పెట్టుకుంటూ వ‌స్తున్నాడు. ఇది గ‌మ‌నించిన అత‌ని త‌ల్లి .. తన కుమారుడితో సంబంధాలు ఉన్న 8 మంది వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
వీరిలో బ్రెండన్ కూడా ఉండటంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బ్రెండన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన‌ట్టు తెలుస్తుంది. అక్టోబర్ 3 వరకు ఆయనను కోర్టు రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. దక్షిణాఫ్రికాకు చెందిన బ్రెండన్... కంగ‌నాతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు హెయిర్ స్టయిలిస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"2.O"లో అతిథి పాత్రలో ఐశ్వర్యా రాయ్ సర్‌ప్రైజ్