తెలుగు సినిమా కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఇప్పటికే రాజమౌళి ఖాతాలో ఇప్పటికే అత్యున్నత పదశ్రీ అవార్డు చేరిన నేపథ్యంలో.. తాజాగా సిఎన్ఎన్ ఐబిఎన్ ఇండియన్ ఆఫ్ ద యియర్ 2016 అవార్డును రాజమౌళి సొంతం చేసుకున్నారు.
ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుని తెలుగు చిత్ర సీమ కీర్తిప్రతిష్టలను మరోమారు జాతీయ స్థాయిలో ఎగరవేయడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ సహా ఎందరో ప్రముఖులు తమ అభినందనలతో రాజమౌళిని ముంచెత్తుతున్నారు.
ఇప్పటికే రాజమౌళి కీర్తికిరీటంలో పద్మశ్రీ అవార్డు కూడా చేరిన సంగతి తెలిసిందే. రాజమౌళితోపాటు ఈ అవార్డుకు బాలీవుడ్ నటీమణి ప్రియాంక చోప్రా, హీరో రణవీర్ సింగ్, బాజీరావ్ మస్తానీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీల పేర్లు కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.