Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క‌మ‌ల్‌ కామ‌రాజు, ఇషా చావ్లా జంట‌గా 4 బాష‌ల్లో `అగోచ‌ర`

Advertiesment
Kabir Lal
, గురువారం, 18 ఫిబ్రవరి 2021 (16:28 IST)
Kabir Lal, Kamal Kamaraju, Esha Chawla
క‌మ‌ల్ కామ‌రాజు, ఇషా చావ్లా హీరో హీరోయిన్లుగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్ తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న చిత్రం `అగోచ‌ర`. స్పానిష్ థ్రిల్లర్ చిత్రం జూలియా ఐస్ స్పూర్తితో ఈ మూవీ రూపొందుతోంది. ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఉత్తరాఖండ్‌లోని అందమైన ప్రదేశాలలో ప్రారంభ‌మైంది. గడ్డకట్టే చల్లటి వాతావరణ పరిస్థితుల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.
 
ఇషా చావ్లా, క‌మ‌ల్ కామ‌రాజు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో ఇషా చావ్లా డ‌బుల్ రోల్‌లో న‌టించ‌డం విశేషం. ఆమె పాత్ర‌లోని భిన్న ఛాయ‌లు ఆడియ‌న్స్‌ని ప్రతి క్షణం థ్రిల్ చేసేలా ఉంటాయి అని చిత్ర యూనిట్ తెలిపింది. కమల్ కామరాజు ఆమెకు మద్దతు ఇచ్చే భర్త పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా ఉండనుంది. ఈ చిత్రంలో సునీల్ వ‌ర్మ‌, బ్రహ్మానందం, అజ‌య్ కుమార్ సింగ్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.
 
లవ్లీ వరల్డ్ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జూన్‌లో విడుదల కానుంది. కబీర్ లాల్ ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ (అగోచర), తమిళం (ఉన్ పార్వాయిల్) మరాఠీ (ఆద్రిష్య) బెంగాలీ (అంతర్ దృష్టి) భాషలలో విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అభిమాని సురేష్‌కు మెగాస్టార్ లక్ష రూపాయల సాయం