Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ నటి పేరును దాచిపెట్టకండి.. పేరును పేర్కొనడంలో తప్పేమీ లేదు: కమల్

మలయాళ నటి భావన కిడ్నాప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు నెలల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు చేస్తున్న దర్యాప్తు కొలిక్కి వచ్చేసింది. సుదీర్ఘ విచారణల అనంతరం అనుమానితుడు

Advertiesment
Kamal Hassan
, శుక్రవారం, 14 జులై 2017 (09:51 IST)
మలయాళ నటి భావన కిడ్నాప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు నెలల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు చేస్తున్న దర్యాప్తు కొలిక్కి వచ్చేసింది. సుదీర్ఘ విచారణల అనంతరం అనుమానితుడుగా ఉన్న హీరో దిలీప్‌ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక దాడికి గురైన నటి భావన పేరును.. నటుడు కమల్‌హాసన్‌ ప్రస్తావించడం కలకలం రేపింది. 
 
తన ‘బిగ్‌బాస్‌’ షోపై వచ్చిన ఆరోపణల గురించి మీడియాతో మాట్లాడిన సందర్భంలో.. మలయాళ నటిపై లైంగికదాడి ప్రస్తావన వచ్చింది. ఆ సమయంలో కమల్‌ ఆమె పేరు పెట్టి ప్రస్తావిస్తూ మద్దతు తెలిపారు. మహిళలకు రక్షణ కల్పించడం అందరి బాధ్యత అన్నారు.
 
అయితే లైంగికదాడి కేసు బాధితురాలి పేరు బయటకి చెప్పడంపై విలేకరులు అభ్యంతరం తెలిపారు. కానీ ఆమె పేరు పైకి చెప్తే తప్పులేదన్నారు. మీరూ దాచాల్సిన పనిలేదన్నారు. ఈ విషయంలో తన మద్దతు బాధితురాలికే. చట్టాన్ని గౌరవిస్తానని.. ఆమె సాధారణ వ్యక్తా.. హీరోయిన్‌గా అనేది ముఖ్యం కాదని.. మహిళలను కాపాడటం తనతో పాటు ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. ఆ నటి పేరును దాచిపెట్టకండి. ఆమె పేరును పేర్కొనడంలో తప్పేమీ లేదంటూ విలేకరులతో కమల్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిలీప్ అరెస్టుతో అందరిలాగానే నేను కూడా షాకయ్యా.. నేరం చేస్తే శిక్ష తప్పదు: భావన