Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాహుబలి 2: కన్నడ ప్రజలకు సత్యరాజ్ సారీ.. కమల్ హాసన్ ఏమన్నారంటే?

సినీ నటుడు, కట్టప్ప సత్యరాజ్ కావేరీ జలాలపై చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేగింది. సత్యరాజ్ కన్నడిగులపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని లేకుంటే 'బాహుబలి' (ది కన్‌క్లూజన్‌) సినిమా విడుదలకు అడ్

బాహుబలి 2: కన్నడ ప్రజలకు సత్యరాజ్ సారీ.. కమల్ హాసన్ ఏమన్నారంటే?
, శనివారం, 22 ఏప్రియల్ 2017 (15:48 IST)
సినీ నటుడు, కట్టప్ప సత్యరాజ్ కావేరీ జలాలపై చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేగింది. సత్యరాజ్ కన్నడిగులపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని లేకుంటే 'బాహుబలి'  (ది కన్‌క్లూజన్‌) సినిమా విడుదలకు అడ్డంకి కలిగిస్తామని వ్యతిరేకత రావడంతో.. ఇక దారిలేక దర్శకుడు రాజమౌళి సత్యరాజ్‌ క్షమాపణలు చెప్పారు. కర్ణాటక ప్రజలపై తనకెప్పుడూ చిన్నచూపు లేదని.. తన వ్యాఖ్యలకు ఎవరైనా  బాధపడి వుంటే క్షమించాల్సిందిగా సత్యరాజ్ కోరిన సంగతి తెలిసిందే. తాజాగా సత్యరాజ్ క్షమాపణ చెప్పడంపై సినీ లెజండ్ కమల్ హాసన్ స్పందించారు. 
 
సత్యరాజ్ గొప్ప మానవుడని.. సంక్లిష్ట వాతావరణంలో హేతుబద్ధతను కాపాడిన సత్యరాజ్‌కు కమల్ హాసన్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తన సినిమా విరుమాండిలోని క్షమాపణ కోరినవాడే గొప్పమానవుడు అన్న మాటలను ఉటంకించారు. అయితే తమిళ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాజా మాత్రం సత్యరాజ్, కమల్‌లపై ఫైర్ అయ్యారు. వారికి డబ్బుమీద ధ్యాస వుందే తప్ప తమిళుల మీద ప్రేమ లేదని ట్వీట్ చేశారు. సత్యరాజ్ క్షమాపణలు డబ్బు కోసం ఆత్మగౌరవాన్ని మంటగలిపిన చర్యగా అభివర్ణించారు. 
 
ఇదిలా ఉంటే.. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ చిక్కుల్లోపడ్డారు. హిందువులు పవిత్రంగా భావించే మహాభారత ఇతిహాసంపై కమల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా తమిళనాడులోని వలియూర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ కేసులో మే 5వ తేదీన హాజరై వివరణ ఇవ్వాలని కోర్టు ఆయన్ను ఆదేశించింది. 
 
గత మార్చి 12న ఓ తమిళ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్‌ మహాభారతంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్టు పిటిషన్‌దారు పేర్కొన్నారు. దేశంలో ప్రజలు మహిళలను తక్కువ భావనతో చూస్తారని, మహాభారతంలో కూడా ఓ మహిళను పాచికలాటలో పందెం కాశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కమల్‌కు కష్టాలు తప్పలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జై లవకుశ: ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ భయంకరంగా ఉంటుంది.. టైగర్.. భార్య వద్ద తిట్లు తిన్నాడా?