కమల్ హాసన్ పుట్టిన రోజు.. ''తీవ్రవాదం''లోని అర్థం తెలుసా? అదే గాంధీజీని చంపింది..
హిందూ తీవ్రవాదం అంటూ తను రాసిన వ్యాసం, చేసిన వ్యాఖ్యల పట్ల కమల్ హాసన్ తన పుట్టినరోజు సందర్భంగా స్పందించారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ''తీవ్రవాదం'' అనే పదాన్ని ప్రత్యేకంగా చూడాలన్నారు. "తీవ్
సినీ లెజండ్ కమల్ హాసన్ పుట్టినరోజు నేడు (నవంబర్ 7). 1954లో తమిళనాడు రాష్ట్రం రామనాథ పురం జిల్లాలోని పరమక్కుడిలో జన్మించిన కమల్ హాసన్ బహుముఖ ప్రజ్ఞ గల నటుడు. దక్షిణ భారత సినిమాల్లోనూ అందులోనూ అనేక తమిళ చిత్రాల్లో నటించిన కమల్ హాసన్.. దేశమంతటా సుపరిచితుడు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ హాసన్ ఆపై తన సినీ కెరీర్‌లో అనేక అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడుసార్లు సొంతం చేసుకున్నారు.
1990లో కేంద్ర ప్రభుత్వం కమల్ హసన్‌ను పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది. 2005లో మద్రాసులోని సత్యభామ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. 2014లో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. మూడు దశాబ్దాలకు పైబడిన నట జీవితంలో కమల్ హసన్ మొత్తం 171 అవార్డులను కమల్ హాసన్ సొంతం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని కళైమామణి అవార్డుతో సత్కరించింది. ఇప్పటివరకు నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, గాయకుడిగా అనేక విభాగాల్లో తన సత్తా చాటిన కమల్ హాసన్.. వందకు మించిన సినిమాల్లో నటించారు. ప్రస్తుతం పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలని కమల్ హాసన్ సంసిద్ధమయ్యారు. ఈ క్రమంలో సామాజిక అంశాలపై కామెంట్లు చేస్తున్నారు. నోట్ల రద్దు, ప్రజా ఇబ్బందులపై స్పందించిన కమల్ హాసన్ తాజాగా హిందూ తీవ్రవాదంపై చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి.
హిందూ ఉగ్రవాదం అంటూ సినీ నటుడు చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. కమల్ హాసన్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. కేవలం ఓట్ల కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము సహించమన్నారు. హిందువుల్లో ఉగ్రవాదం పెరుగుతోందన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం కమల్‌కు సరికాదన్నారు. బాలీవుడ్ సినిమా పద్మావతిపై కూడా ఆయన స్పందించారు. చరిత్రను వక్రీకరించారనే ప్రశ్నలు తలెత్తినప్పుడు ప్రదర్శననలు నిలిపేయాల్సి వస్తుందన్నారు.
ఈ నేపథ్యంలో హిందూ తీవ్రవాదం అంటూ తను రాసిన వ్యాసం, చేసిన వ్యాఖ్యల పట్ల కమల్ హాసన్ తన పుట్టినరోజు సందర్భంగా స్పందించారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ''తీవ్రవాదం'' అనే పదాన్ని ప్రత్యేకంగా చూడాలన్నారు. "తీవ్ర" అంటే "ఎక్స్‌ట్రీమ్" అనే అర్థం ఉంది అని, తన ఉద్దేశం అదే అనే కమల్ స్పష్టం చేశాడు. హిందూ తీవ్రవాదం అంటే.. హిందూ టెర్రరిజం అనేది తన ఉద్దేశం కాదని, హిందూ అతివాదాన్ని తాను తప్పుబడుతున్నానని వివరణ ఇచ్చారు. హిందూ అతివాదానికి తాను పూర్తి వ్యతిరేకమని.. అది తీవ్రరూపం దాల్చి జాతిపిత మహాత్మాగాంధీని కూడా చంపేసిందని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు.
తనను చంపాలి.. షూట్ చేయాలి.. అని కొన్ని హిందూ సంస్థలు పిలుపునివ్వడాన్ని కమల్ స్వాగతించాడు. వాళ్లకు చంపాలి అనిపిస్తే తనను చంపవచ్చని.. అందుకు తనకు సమ్మతమేనని, అయితే తనదే వారి చేతిల్లో చివరి చావు కావాలన్నారు. మరెవరూ బలి కావడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు.