Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కమల్ హాసన్ తమిళ ఓటరు కాదా? : ఓటర్ల జాబితాలో పేరు గల్లంతు!

Advertiesment
కమల్ హాసన్ తమిళ ఓటరు కాదా? : ఓటర్ల జాబితాలో పేరు గల్లంతు!
, శనివారం, 30 ఏప్రియల్ 2016 (14:00 IST)
కమల్‌హాసన్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీగా ఓ చిత్రం రూపొందుతుంది. హిందీలో ''శభాష్ కుందు'', తెలుగు, తమిళ భాషల్లో ''శభాష్ నాయుడు'' అనే టైటిల్‌తో సినిమాని తీయబోతున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేసినట్లు కమల్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ఈ త్రిభాషా చిత్రానికి ప్రముఖ మలయాళ దర్శకుడు టి.కె.రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, కమల్ గారాలపట్టి శ్రుతిహాసన్ ఈ చిత్రంలో నటిస్తోంది. 
 
కాగా మరో ముఖ్యపాత్రలో రమ్యకృష్ణ, ఇంకా బ్రహ్మానందం, సౌరభ్‌శుక్లా, ఆనంద్ మహాదేవ్, భరత్‌బహుండల్, ఫరిదాజలాల్, సిద్ధిక్, మనునారాయణన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం నడిగర్ సంఘం కార్యాలయంలో జరిగింది. ఇందులో కమలహాసన్, శ్రుతిహాసన్, దర్శకుడు టి.కె.రాజీవ్‌కుమార్, సంగీత దర్శకుడు ఇళయరాజా తదితరులు పాల్గొన్నారు. 
 
అనంతరం కమలహాసన్ మాట్లాడుతూ, ఈ 'శభాష్‌ నాయుడు' చిత్రం హ్యూమరస్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. అంతేకాదు మే నెల 16న తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 'ఓటు హక్కు వినియోగించుకోరా?' అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 'ఓటు వేయను, కారణం ఓటరు లిస్ట్‌తో నా పేరు లేదు', 'గత పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయాలని వెళితే, అప్పటికే నా ఓటును వేరెవరో వేసేశారు, ఈ సారైనా ఓటు వేయాలనుకున్నాను, కానీ ఓటరు జాబితాలో నా పేరే లేదు'' కాబట్టి ఓటు వేయను అని కమల్ కరాఖండిగా తేల్చి చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'బ్రహ్మోత్సవం' కోసం కాపీ కొట్టిన మహేష్ బాబు... నెటిజన్ల విమర్శలు.. సెటైర్లు!