కళ్యాణ్‌రామ్, పూరి జగన్నాథ్‌ల 'ఇజం' టీజర్‌కు 1 మిలియన్ వ్యూస్
నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఇజం'. ఈ చిత్రానికి సంబంధించ
నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఇజం'. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సెప్టెంబర్ 5వ తేదీన పూరి జగన్నాథ్ విడుదల చేశారు.
ఈ టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్ విడుదలైన 48 గంటలలోపే ఈ టీజర్ 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలోని కళ్యాణ్‌రామ్ లుక్‌కి మంచి అప్రిషియేషన్ వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న 'ఇజం' చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
డేరింగ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్, బండ రఘు, శత్రు, అజయ్‌ఘోష్, శ్రీకాంత్, కోటేష్ మాధవ, నయన్ (ముంబై), రవి (ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.