Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయ్ కనిష్క హీరోగా చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ ప్రారంభించిన కలవరం సినిమా

Vijay Kanishka, Chadalavada Srinivasa Rao, C Kalyan and others

డీవీ

, శనివారం, 4 జనవరి 2025 (18:56 IST)
Vijay Kanishka, Chadalavada Srinivasa Rao, C Kalyan and others
విజయ్ కనిష్క, గరిమ చౌహన్ హీరో, హీరోయిన్లుగా  హనుమాన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా కలవరం నేడు సారథి స్టూడియోలో ప్రారంభమైంది.. లవ్ స్టోరీ తో పాటు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి శశాంక్ కథని అందించగా సినిమాటోగ్రాఫర్ గా వెంకట్ అలాగే మ్యూజిక్ అందించింది దేవిశ్రీ ప్రసాద్ దగ్గర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తూ ఉండే వికాస్ బాడిస. నేడే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు చదలవాడ శ్రీనివాసరావు గారు, సి కళ్యాణ్ గారి చేతుల మీదుగా చేసి ఘనంగా ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ : ఈ సినిమా కథ తెలుసు. ఇది బాలచందర్, భాగ్య రాజా వంటి క్రియేటివ్ డైరెక్టర్స్ తీయగలిగే మంచి కథ ఉన్న  సినిమా. ఇప్పటిదాకా చిన్న సినిమాలను పట్టించుకున్న ప్రభుత్వం లేదు. ఇప్పుడున్న ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలైన చిన్న సినిమాలకు తోడ్పాటు కల్పించాలి. చిన్న సినిమాలకి షోలు ఎక్కువ ఇవ్వడం అదేవిధంగా మినీ థియేటర్లు కట్టి సపోర్ట్ ఇవ్వాలి. కలవరం టైటిల్ చాలా మంచి టైటిల్. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి హీరో హీరోయిన్ల కి మూవీ టీంకి మంచి పేరు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. 
 
దర్శకుడు హనుమాన్ వాసంశెట్టి మాట్లాడుతూ : ఈ కథ చెప్పిన వెంటనే నచ్చి సపోర్ట్ చేసి మనం ఈ సినిమా చేస్తున్నాం అని నిర్మాత శోభ రాణి గారు చెప్పడం జరిగింది. వెంటనే చెన్నై వెళ్లి హీరో కి కథ చెప్పాము. హీరో విజయ్ కనిష్క గారికి కూడా ఈ కథ చాలా నచ్చి మనం ఈ సినిమా చేస్తున్నాము అని అన్నారు.  ఈ రోజున ఇలా గ్రాండ్ గా ప్రారంభించడం జరిగింది. నన్ను నా కథని నమ్మి నాకే అవకాశం ఇచ్చిన శోభ రాణి గారికి హీరో విజయ్ కనిష్క గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
 
హీరో విజయ్ కనిష్క మాట్లాడుతూ : మా నాన్నగారు విక్రమంగారు తమిళ్ లో ఎన్నో సినిమాలు దర్శకత్వం వహించారు. తెలుగులో వసంతం, చెప్పవే చిరుగాలి వంటి సినిమాలు కూడా దర్శకత్వం వహించారు. నా మొదటి సినిమా హిట్ లిస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ తండ్రి పేరు నిలబెట్టారు నిలబెటవ్ అన్నారు. ఆ మాట నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఇప్పుడు ఈ కలవరం కథ విన్నాక అంతకంటే ఎక్కువ ఎక్సైట్ అయ్యాను. శోభ గారు డైరెక్టర్ హనుమాన్ గారు మంచి ప్యాషన్ తో ఈ కథని నాకు వినిపించారు. ఈ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి మంచి సినిమాలు కొత్త టాలెంట్ ఇంకా ఎంతోమంది మీ ముందుకు వస్తారు. ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని నమ్మకంతో ఉన్నాను అన్నారు.
 
కథ రచయిత శశాంక్ పి మాట్లాడుతూ :  కథ వినగానే ఈ సినిమా మనం చేస్తున్నామని సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ శోభారాణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను, డైరెక్టర్ హనుమాన్ కలిసే స్క్రిప్ట్ ని తయారు చేశాం. అదేవిధంగా కథ విన్న వెంటనే హీరో విజయ్ కనిష్క గారు ఈ సినిమాను ఒప్పుకుని ముందుకు వచ్చారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరినీ అలరిస్తుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
 
నిర్మాత శోభారాణి  మాట్లాడుతూ : కలవరం అనే టైటిల్ ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ చిత్రంలో 70 మంది ఆర్టిస్టులు ఉన్నారు. వారి గురించి త్వరలోనే వివరాలు విడుదల చేస్తాము. ప్రేక్షకులు అందరూ మెచ్చే సినిమా అవుతుందని కచ్చితంగా చెప్తున్నాను అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంకటేష్ గారు పాడడం.. సినిమాకు పనిచేయడం నాకు కలగా వుంది : భీమ్స్ సిసిరోలియో