సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు సంగీతం సమకూర్చిన మణిశర్మే ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు సైతం మణిశర్మతోనే నేపథ్య సంగీతం చేయించాలని చిత్ర యూనిట్ అనుకుంది. అయితే ఏం జరిగిందో ఏమో చివరి నిమిషంలో మణిశర్మ ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇప్పుడు హడావుడిగా మిక్కీ జే మేయర్‌తో పాటు గోపీసుందర్ కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ పని చూస్తున్నారట.
గోపీసుందర్ పీవీపీ వాళ్ల గత సినిమా ‘ఊపిరి’కి సంగీతాన్నందించాడు. పాటలతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘బ్రహ్మోత్సవం’లోని ఓ కీలక ఎపిసోడ్‌కు అతను నేపథ్య సంగీతం సమకూరుస్తుంటే.. మిక్కీ జే మేయర్ మిగతా అంతా చూసుకున్నాడు.
ఓవైపు డబ్బింగ్, మరోవైపు రీరికార్డింగ్, ఇంకోవైపు మిక్సింగ్ వంటి పనుల్లో బ్రహ్మోత్సవం టీమ్ బిజీ బిజీగా ఉంది. అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న బ్రహ్మోత్సవం 20న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను సోషల్ మీడియాలో సినీ యూనిట్ రిలీజ్ చేసింది.