Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘ఎంత వరకు ఈ ప్రేమ’లో బోల్డ్ రొమాన్స్‌తో రెచ్చిపోయిన కాజల్

'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ `కవలై వేండాం`. ఈ చిత్రాన్ని తెలుగులో `ఎంత వరకు ఈ ప్రేమ`

Advertiesment
Kajal bold romance in Enthavaraku Ee Prema
, శుక్రవారం, 4 నవంబరు 2016 (16:36 IST)
'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ `కవలై వేండాం`. ఈ చిత్రాన్ని తెలుగులో `ఎంత వరకు ఈ ప్రేమ` అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. `యామిరుక్క బ‌య‌మేల్‌` ఫేమ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. 
 
డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ `సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌యి ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈమధ్యే విడుదలైన పాటలకు సైతం అభిమానుల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా మంచి ఫీల్ గుడ్ సినిమా ఇది. జీవా, కాజ‌ల్ జంట న‌టించిన ప్ర‌తి సీన్ ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. సినిమాకు లియోన్ జేమ్స్ మ్యూజిక్‌, అభినంద‌న్ రామానుజ‌మ్ సినిమాటోగ్ర‌ఫీ పెద్ద ఎసెట్ అవుతాయి. 
 
తెలుగులో వెన్నలకంటి అందించిన మాట‌లు, పాట‌లు చాలా చక్కగా కుదిరాయి. ఈ సినిమాకు డ‌బ్బింగ్ చెప్పిన క‌ళాకారులు కూడా సినిమా చాలా బాగా ఉంద‌ని మెచ్చుకున్నారు. ఈ సినిమా అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో పాటు సినిమా ప్రేక్షకుల మ‌న‌సుకు హ‌త్తుకునేలా ఆహ్లాదంగా ఉంటుంది. జీవా, కాజ‌ల్ న‌ట‌న‌తో పాటు మిగ‌తా ఆర్టిస్టుల నటన, టెక్నీషియ‌న్ స‌పోర్ట్‌తో సినిమా చాలా బాగా వ‌చ్చింది. సినిమాను ఈనెలలో విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. 
 
జీవా, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజమ్, మ్యూజిక్: లియోన్ జేమ్స్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: డీకే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ హీరోయిన్ కోసం పవన్ సపోర్ట్ కోరుతున్న నితిన్.. నిజమా...?